మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో రభస ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతుంది.తాజాగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు రాజకీయాలలో కంటే టాలీవుడ్ లోనే ప్రస్తుతం పాలిటిక్స్ ఎక్కువ ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండస్త్రీ ఎవరి దయా దాక్షిణ్యాల మీద నడవట్లేదు. ఇండస్ట్రీలో టాలెంట్ ఒకటే సక్సెస్ ను డిసైడ్ చేస్తుంది.మేం ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నాం అని కబురులు చెబితే కుదరదని ఆయన అన్నారు.
ప్రస్తుతం మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి అన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.