మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో రభస ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతుంది.తాజాగా ఈ అంశంపై మాట్లాడిన మోహన్ బాబు తమకు ఓటు వేయని వాళ్లపై పగ సాధించడానికి ట్రై చేయకండి అందరినీ కలుపు కెళ్ళండి అలాగే మా ఖ్యాతిని దేశం గర్వించేంత పెంచాలని విష్ణు ప్యానెల్ కు పిలుపునిచ్చారు.అలాగే మా ఎన్నికల సందర్భంలో కొందరు బెదిరింపులకు దిగారని అలాంటి సమయంలో విష్ణుకు అండగా నిలిచిన నరేష్ విష్ణు విజయంలో కీలక పాత్ర పోషించారని మోహన్ బాబు అన్నారు.
అలాగే మా సభ్యుల ఇల్లు సమస్య గురించి చర్చించడానికి త్వరలో తాను సీఎం కేసిఆర్ ను కలుస్తునని అన్నారు.