Modi: సినిమాలో విషయం బాగా ఉంటే.. అది ఏ భాషలో ఉన్నా కానీ ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. కన్నడలో విడుదలైన ‘కాంతార’ సినిమా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలైన విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా భారీగా వసూళ్లను రాబడుతోంది.
తెలుగులో కూడా ‘కాంతార’ సినిమాకు విపరీమైన మౌత్ పబ్లిసిటీ రావడంతో అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సినిమా ఇప్పటికే 230 కోట్ల మార్క్ ను దాటినట్లు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాగా మారిపోయింది. కేజీఎఫ్ తర్వాత భారీగా వసూళ్లు రాబట్టిన సినిమాగా కన్నడలో కాంతార రికార్డు క్రియేట్ చేసింది.
అన్ని వర్గాల ప్రజల నుండి మంచి స్పందన అందుకుంటున్న కాంతార సినిమాను త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చూడబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. నవంబర్ 14వ తేదీన ప్రధాని మోదీ ‘కాంతార’ డైరెక్టర్, హీరో రిషబ్ శెట్టితో కలిసి స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూడబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుగుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఈ వార్త మరింత ప్లస్ కానుంది.
Modi:
ఇప్పటికే పాజిటివ్ టాక్ తో, ఊహించని విధంగా కలెక్షన్లను రాబడుతున్న సినిమాగా ‘కాంతార’ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. మరి ఈ సినిమా చూసిన తర్వాత ప్రధాని మోదీ ఎలా స్పందిస్తారో అనేది అందరిలో ఆసక్తిని రేపుతోంది. కాగా కేవలం రూ.19కోట్ల లో బడ్జెట్ తో నిర్మితమైన ‘కాంతార’ సినిమా త్వరలోనే రూ.300 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.