MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి గత కొద్దిరోజుల క్రితం దేశవ్యాప్తంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ దాడులు చేపట్టింది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో మరోసారి శుక్రవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, నెల్లూరుతో పాటు చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో పలువురి ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. ఢిల్లీ నుంచి వచ్చి ఈడీ స్పెషల్ బృందాలు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.
అయితే హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత దగ్గర గతంలో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గతంలో కవిత దగ్గర ఆయన ఆడిటర్ గా పనిచేశారు. హైదరాబాద్ లోని దోమలగూడలోని అవరింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు జరిపడం టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది. గతంలో ఆయన ఎమ్మెల్సీ కవితతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి.
MLC Kavitha:
అయితే ఇప్పటికే ఈ కేసులో కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై కవిత ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. తనకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని, ఢిల్లీలో కూర్చోని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజాలు చెప్పడానికి మీడియా సమయం ఉపయోగించుకోవాలని సలహా ఇచ్చారు. టీవీ వ్యూహర్స్ టైమ్ ను సేవ్ చేయడానికి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. కానీ ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు జరపడంతో త్వరలో కవితకు నోటీసులు జారీ చేే అవకాశం ఉందనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.