Minister Roja : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అడ్రస్ లేని ఒక వెధవ అంటూ మంత్రి ఆర్కే రోజా నేడు రెచ్చిపోయారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన బినామీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసమే అమరావతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఒక పిల్ల పిత్రే అని.. ఎమ్మెల్యేగా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. లోకేష్ తన తల్లి, భార్యతో చంద్రబాబును బెదిరించి దొడ్డి దారిన ఎమ్మెల్సీ అయిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. లోకేష్ ఏది పడితే అది మాట్లాడితే జనాలతో అక్కడే కొట్టిస్తానంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానుల బిల్లు పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని టీడీఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందన్నారు. అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిందని రోజా పేర్కొన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా అని ప్రశ్నించారు. కొడాలి నాని భాషలో తప్పేముందని.. ఆయన పై ఈగ వాలితే సహించేది లేదన్నారు.
Minister Roja : కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరు..
టీడీపీ నేతలు రౌడీయిజం చేస్తూ ఇళ్ళ పై దాడి చేస్తారా? అంటూ రోజా మండిపడ్డారు. టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొడాలి నాని, తాను టీడీపీ నుంచే వచ్చామని రోజా గుర్తు చేశారు. కొడాలి నాని మాట్లాడిన వాటిలో తప్పు ఏముందని.. నాడు ఎన్టీఆర్ అభిమానులుగా తాము టీడీపీలో ఉన్నామని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బయటకు వచ్చామన్నారు. కొడాలి నాని గడ్డంలో తెల్ల వెంట్రుక కూడా పీకలేరంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో పెట్టుకుంటే తరిమి తరిమి కొడతామన్నారు. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు. టీడీపీ గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందని రోజా పేర్కొన్నారు.