Mimicry Moorthy : తన మాటలతో గారడీ చేసి మెస్మెరైసింగ్ మిమిక్రీ తో అందరినీ అలరించిన మిమిక్రి ఆర్టిస్ట్ మూర్తి ఇక లేరన్న వార్త ఇండస్ట్రీని కలచివేస్తుంది. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న మూర్తి హన్మకొండలో తుది శ్వాస విడిచారు. అభిమానులు శోకసంద్రంలో ముంచారు. ఎన్నో వేదికలపై అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు మూర్తి. ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఆర్టిస్టుగా ఎదిగారు .

Mimicry Moorthy : పాంక్రియాస్ కాన్సర్ తో గత కొంతకాలంగా మూర్తి బాధపడుతున్నారు. అయితే జీవిత పై ఏమాత్రం నమ్మకం కోల్పోని పూర్తి చివరి వరకు క్యాన్సర్ తో పోరాడుతూనే ఉన్నారు. మహమ్మారి నీ చిత్తు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎక్కడా నమ్మకాన్ని కోల్పోలేదు. రోజువారి మెడిసిన్ తీసుకున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇప్పటివరకు 16 లక్షలకు పైగానే తన వైద్యం కోసం ఖర్చు చేశారు మూర్తి. ఆ మెడిసిన్ కూడా వికటించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ తో ఫేమస్ ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకున్నారు మూర్తి. రాకింగ్ రాకేష్, కిరాక్ ఆర్ పి టీముల్లో ఏ పాత్ర ఇచ్చిన అందులో పరకాయ ప్రవేశం చేసి తన మాటలతో ప్రేక్షకులను అలరించారు. ఒకానొక దశలో టీం లీడర్ గా కూడా చేసే అవకాశం వచ్చింది. కానీ ఆరోగ్యం బాలేక తన ప్రయాణాన్ని అక్కడితోటే ఆపారు.
కమెడియన్ వేణుమాధవ్ అంటే మూర్తికి ఎంతో ఇష్టం. ఆయన ఇన్స్పిరేషన్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టానని చెప్పేవారు మూర్తి. వేణుమాధవ్ వాయిస్ లో ఈయన చేసే మిమిక్రీ నిజంగా వేణుమాధవ్ నే దించేసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు అందరినీ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలని తన మిమిక్రీ చేస్తున్నానని చెప్పే మూర్తి ఇప్పుడు అందరికీ కన్నీటిని మిగిల్చారు. అందరికీ నవ్వులు పంచిన జూనియర్ వేణుమాధవ్ ఇకలేరన్న వార్త ఇటు జబర్దస్త్ టీం సభ్యలను కూడా తీవ్ర దుఃఖంలో ముంచేసింది.