Tamannah : మిల్కీబ్యూటీ తమన్నా ఏంటి ఇంత షాక్ ఇచ్చింది? అని అనుకోకుండా ఉండలేరు మీరు కూడా విషయం తెలిస్తే. ఇటీవల అమ్మడి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ ముద్దుగుమ్మ ముంబైకి చెందిన ఓ వ్యాపారిని వివాహం చేసుకోబోతోందంటూ పెద్ద ఎత్తున రచ్చ నడించింది. ఇటీవలి కాలంలో కొత్త హీరోయిన్లంతా వచ్చేసి పాత హీరోయిన్ల అవకాశాలకు గండి కొడుతున్న విషయం తెలిసిందే. అవకాశాలు రాక కామ్‌గా వెబ్ సిరీస్‌లో అవో ఇవో చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు కొందరు నటీమణులు.
ఒకరకంగా చెప్పాలంగా తమన్నా పరిస్థితి కూడా అదే. కానీ అమ్మడు తన పెళ్లి కారణంగానే సినిమాలకు దూరంగా ఉంటోందంటూ సోషల్ మీడియాలో కారణాలు చెప్పి ఆమె పెళ్లి వార్తలను వైరల్ చేశారు. తాజాగా తన పెళ్లి వార్తలపై మిల్కీ బ్యూటీ స్పందించింది. వెంటనే తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. కొద్ది రోజులుగా వస్తున్న తన పెళ్లి రూమర్స్‌పై ఇన్‌స్టాగ్రాం వేదికగా స్పందించింది. తనకు కాబోయే భర్త ఇతడేనంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది.
‘నా భర్తను పరిచయం చేస్తున్నా.. ఆ వ్యాపారవేత్త ఇతనే’ అంటూ వీడియోను పంచుకుంది. అయితే అందులో మగాడి వేషంలో తమన్నా కనిపించేసరికి నెటిజన్లు అవాక్కయ్యారు. మగాడి వేషంలో చేసిన ఓ రీల్‌కు సంబంధించిన వీడియోను మిల్కీబ్యూటీ షేర్ చేసింది. ‘ఎఫ్ 3’ మూవీలో తమన్నా పలు సన్నివేశాల్లో మగాడి వేషంలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఈ వీడియో కూడా చేసింది. తమన్నా తీసుకున్న వీడియో క్లిప్‌ను ఇప్పుడు షేర్ చేసి తన పెళ్లి వార్తలను ఖండించింది. అమ్మడు తన పెళ్లి వార్తలను వైరల్ చేస్తున్న నెటిజన్లకు ఊహించని షాక్ ఇచ్చింది.