Migraine Treatment: మైగ్రేన్ అనేది చాలామందిలో ఎంతో బాధకు కారణమయ్యే సమస్య. మైగ్రేన్ తో బాధపడే వారికి విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. నాడీ సంబంధమైన ఈ రుగ్మతకు ఒత్తిడి, మారిన జీవన విధానం లాంటివి కారణాలు కావచ్చు. మైగ్రేన్ ను సరిపోయే ట్రీట్మెంట్ ఏదీ లేదు. కానీ ఆయుర్వేదంలో మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి మాత్రం పలు చిట్కాలు ఉన్నాయి. మైగ్రేన్ నుండి ఉపశమనం పొందడానికి ఏం చేయాలో తెలుసుకోండి.
పంచకర్మ థెరపీ:
ఆయుర్వేదంలో పంచకర్మ అనేది ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి ఎంతో మేలు కలుగుతుంది. అయితే మైగ్రేన్ తో బాధపడే వారు పంచకర్మ థెరపీ చేయించుకోవాలట.
యోగా:
మనకు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు యోగా ఓ అద్భుతమైన పరిష్కారం అని చెప్పుకోవాలి. అందుకే యోగాకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. మైగ్రేన్ తో బాధపడే వారు యోగా చేయడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.
Migraine Treatment: క్రమం తప్పకుండా వ్యాయామం:
శరీరానికి తగినంత శ్రమ ఉంటే సగం అనారోగ్య సమస్యలు మనకు రావని వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకే శరీరానికి శ్రమ కలిగించేలా వ్యాయామం చేయాలని సలహా ఇస్తుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి మైగ్రేన్ నుండి విముక్తి లభిస్తుంది.