సందీప్ కిషన్ హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా మైఖేల్. ఈ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కాన్సెప్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఉండబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ టీజర్ ని అన్ని బాషలలో ఒకే సారి లాంచ్ చేశారు.ఒక్కో భాషలో ఒక్కో సెలబ్రెటీ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ జరిగింది. ఇక టీజర్ లో సందీప్ కిషన్ సిక్ ప్యాక్ లుక్ లో ఒక గ్యాంగ్ స్టార్ దగ్గర పనిచేసే రౌడీ తరహాలో పాత్ర ఉంది. సందీప్ కిషన్ కి మాస్టర్ ఎవరో జీవితం గురించి పాఠాలు చెబుతూ ఉంటే వాటిని వింటూ దానికి సందీప్ కిషన్ చెప్పే డైలాగ్స్ టీజర్ లో ఆకట్టుకున్నాయి.
వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయి మైఖేల్ అంటూ మాస్టర్ అనే క్యారెక్టర్ చెప్పే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. మన్నించేటపుడు మనం దేవుడు అవుతాం మైఖేల్ అని మాస్టర్ క్యారెక్టర్ అంటే నాకు దేవుడు అవ్వాలని లేదు మాస్టర్ మనిషిగా ఉంటే చాలు అనే డైలాగ్ తో టీజర్ ఎండ్ చేశారు. ఇక ఆ మధ్య అంతా కంప్లీట్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నడిపించారు.
ఇక ఈ డైలాగ్స్ బట్టి చూస్తుంటే తప్పనిసరి పరిస్థితిలో వేటాడటం మొదలు పెట్టిన హీరో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడు అనే విషయాన్నీ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో అనసూయ, వరలక్ష్మి శరత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దివ్యాన్శ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నారు. కంటెంట్ పరంగా చూసుకుంటే యూనివర్సల్ కాన్సెప్ట్ తోనే తెరకెక్కుతుంది. మరి ఈ సారైనా మైఖేల్ సినిమాతో సందీప్ కిషన్ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.