జనాలు ఈమధ్య సినిమాలను సినిమాల చూడడం మానేశారు అందుకే పాపం లక్షలు,కోట్లు ఖర్చు చేసి తీసిన సన్నివేశాలను చిత్రీకరించిన పాటల మా మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ సినిమాల పై నానా రాద్ధాంతం చేస్తున్నారు.వాళ్ళు కోరిన విధంగా సన్నివేశాలను పదాలను తొలగించగుంటే సినిమాలను ఆపేస్తామని బెదిరిస్తున్నారు.ఈ లిస్ట్ లో మహిళా సంఘాలు,కుల సంఘాలు కూడా ఉన్నాయి.వాళ్ళలా మాకు పేరు రావాలన్న మేము నలుగురికి తెలియాలన్న సినిమా టార్గెట్ చేయాలి అనుకున్నట్టు ఉన్నారో అందుకే తాజాగా పుష్ప మూవీ సంగ్ పై కేసు వేశారు.ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతున్న ఈ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో తొలిసారి సమంత దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఊ అంటావా మావా.. ఉ ఉ అంటావా మావా అనే ఐటెం సాంగ్ చేసింది.ఈ లిరిక్స్ మగవాళ్ళు కేవలం కామంతోనే ఉంటారన్న వచ్చేలా ఉన్నాయని దీన్ని ఆంధ్రప్రదేశ్ లో బ్యాన్ చేయాలని తాజాగా ఆంధ్రప్రదేశ్ పురుష సంఘం వారు కోర్టు మెట్లు ఇక్కారు.ఇంకా ఈ ఉదంతం ఓ కొలిక్కి రాలేదు.
తాజాగా పురుష సంఘం వేసిన కేసు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది.ఇది చూసిన సినీ విశ్లేషకులు ఇలాంటి సంఘాలు వేసే కేసులను చూస్తుంటే సినిమాలు తీయడం కన్నా ఖాళీగా కూర్చోవడం మేలు అని పెదవి విరుస్తున్నారు.