అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సెన్సేషనల్ గా మారిపోయిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా ఇంపాక్ట్ ఇప్పటికి సందీప్ ఇమేజ్ ని నిలబెట్టడంలో ఉపయోగపడుతుంది. హిందీలో కూడా అర్జున్ రెడ్డిని కబీర్ సింగ్ అనే టైటిల్ తో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపధ్యంలో మూడో సినిమాని కూడా హిందీలోనే చేసే అవకాశం సందీప్ రెడ్డికి వచ్చింది. రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీలో సౌత్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా ఎంపికైంది.
ఇదిలా ఉంటే దీని తర్వాత సందీప్ రెడ్డి వంగా డార్లింగ్ ప్రభాస్ తో సినిమా చేయబోతున్నాడు. స్పిరిట్ అనే టైటిల్ తో అనే సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా జరిగింది. అయితే ఈ సినిమా కంటే ముందుగా సందీప్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. రీసెంట్ గా చిరంజీవిని కలిసి అతను కథ చెప్పాడని, మెగాస్టార్ కి ఈ స్టోరీ బాగా నచ్చిందని టాక్. ఈ నేపధ్యంలో సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి మెగాస్టార్ ఒకే చెప్పారని తెలుస్తుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అవకాశం ఉందని బోగట్టా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేసిన వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో చేసిన భోళా శంకర్ కూడా మార్చి, ఏప్రిల్ ఓ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ రెండు కాకుండా మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కి కూడా చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది. అయితే అంతకంటే ముందుగా సందీప్ రెడ్డి సినిమాని పూర్తి చేసే ఆలోచనతో మెగాస్టార్ ఉన్నట్లుగా ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది.