ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఒప్పుకుంటున్న మెగాస్టార్ కుర్ర హీరోలకు కునుకు లేకుండా చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన గాడ్ ఫాదర్,భోళా శంకర్, బాబీ వాల్తేరు వాసు మూవీలు చేస్తున్నారు.ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు వెంకీ కుడుమల మెగాస్టార్ కు ఒక లైన్ చెప్పారట అది నచ్చడంతో పూర్తి కథను కంప్లీట్ చేసుకొని వస్తే చేద్దామని చెప్పారట.ఈ మూవీకి ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం.
ఈ మూవీలో మెగాస్టార్ సరసన రష్మీక మందాన హీరోయిన్ గా నటించనుంది.మహతి స్వరా సాగర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మెగాస్టార్ ఒప్పుకున్న మూడు చిత్రాలు పూర్తయ్యాక చేస్తారని సమాచారం