Movie News: మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి మరో కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్సింగ్స్ లో చిరు బిజీగా ఉన్నారు. ఖైదీ నంబర్ 150తో అదరగొట్టే రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. ఆ తర్వాత ఆచార్యతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చిరంజీవితో పాటు సందడి చేసి మెగా ఫ్యాన్స్ ని అలరించారు.
ఆయన తాజాగా నటించిన సినిమా గాడ్ ఫాదర్ ఇటీవలే విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక అది అలా ఉంటే చిరంజీవి నటిస్తోన్న మరో సినిమా మెగా 154. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేడ్ వచ్చేసింది. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల తర్వాత చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించి టైటిల్ టీజర్ ఈ నెల 24 వ తేదీన దీపావళి రోజున 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి కొత్త సినిమా అప్ డేట్స్ కోసం మెగా అభిమానులు ఎప్పటికప్పుడు ఆసక్తికరంగానే ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ అప్ డేట్ రావడంతో మెగా అభిమానుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాను సంక్రాంతి బరిలో దించాలనీ టీమ్ భావిస్తోంది. అయితే అదే టైమ్‌కు తెలుగులో బాలయ్య 107 కూడా వస్తోంది. వీటితో పాటు ప్రభాస్ ఆదిపురుష్, అఖిల్ అక్కినేని ఏజెంట్, విజయ్ వారసుడు.. ఈ ఐదు సినిమాలు సంక్రాంతికి రెడీ అవుతున్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏమంటే.. చిరంజీవి 154, బాలయ్య 107లను నిర్మించేది ఒకే సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఈ రెండు సినిమాల్లో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.