టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. 150కి పైగా సినిమాలు చేసిన తెలుగు దిగ్గజ హీరోగా ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా చిరంజీవి ఉన్నారు. ఇండస్ట్రీలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చిన నేనున్నా అంటూ ముందుకొస్తున్న రియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ కి రెడీ. అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి చాలా ఆసక్తికరమైన విషయాలని మీడియాతో పంచుకున్నారు. రాజకీయాల నుంచి దూరమైనట్లు తెలియజేశారు.
అలాగే హీరో సుమన్ జైలుకి వెళ్ళడంలో మెగాస్టార్ ప్రమేయం ఉందని విమర్శలు చేసిన వారికి సమాధానం చెప్పారు. అలాగే మొగల్తూరులో తాను ఇళ్ళు అమ్ముకున్న అని విమర్శించిన వారిపై కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. అలాగే మంత్రి రోజా తనపై చేసిన వ్యాఖ్యలని ఆమెని వివరణ అడగాలని సున్నితంగా కౌంటర్ వేశారు. ఇదిలా ఉంటే తనపై కెరియర్ ఆరంభంలో విషప్రయోగం జరిగింది అనే న్యూస్ భాగా ప్రచారం అయ్యింది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి స్పందించారు.
మరణమృదంగం షూటింగ్ సమయంలో ఓ అభిమాని ప్రసాదం తీసుకొచ్చి తనకి ఇచ్చాడని, అయితే అభిమానంతో ఇచ్చాడని తాను తిన్నానని తెలిపారు. అయితే చేదుగా ఉండటంతో వెంటనే ఊసేయడం జరిగిందని అన్నారు. ఆ విషయం నిర్మాత కెఎస్ రామారావుకి తెలియడంతో వెంటనే అతన్ని పట్టుకొని గట్టిగా నిలదీస్తే నిజం ఒప్పుకున్నారని అన్నారు. కేరళ నుంచి వశీకరణ మందు అందులో కలిపి పెట్టినట్లు చెప్పాడని తెలిపారు. అయితే తాను అతన్ని వదిలేయమని చెప్పడంతో వదిలేసారని అన్నారు. ఇలా ఆ సమయంలో విషప్రయోగం జరగాల్సింది, అదృష్టం కొద్ది బయటపడ్డానని తెలిపారు.