Megastar : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో బోసి నవ్వులు వినిపించనున్నాయి. హీరో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ చిరంజీవి తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ ని పోస్ట్ చేశారు. ఛానళ్ళ తర్వాత వాళ్ళింట్లో వారసుడు రాబోతుండటంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆంజనేయుడు ఆశీస్సులతో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.

2012 జూన్ 14న ఉపాసన కామినేని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు వివాహమైంది. చిన్నప్పటి నుంచి ఓకే స్కూల్ లో చదువుకోవడం ఇద్దరు స్నేహితులు కావడం ఆపై ఒకరిపై ఒకరి ఇష్టం ఏర్పడి కొంత కాలం ప్రేమించుకున్న తర్వాత పెద్ద అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ వారి వారి కెరీర్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నారు. ఉపాసన కామినేని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి మనవరాలు ఒక మ్యాగ్జిన్ ని కూడా నిర్వహిస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఉపాసన. హెల్దీ ఫుడ్ కు సంబంధించిన వివరాలతో పాటు ఫిట్ గా ఎలా ఉండాలో వంటి అంశాల పైన హెల్త్ టిప్స్ లు అందిస్తూ ఉంటుంది.

పెళ్లయినప్పుడు ఉన్న తన పర్సనాలిటీకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనిపిస్తుంది గతంలో ఆమె పర్సనాలిటీని అవహేళన చేసిన వారే ఇప్పుడు ఆమె మార్పులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా పెళ్లయిన సంవత్సరంలోనే పిల్లలు ఎప్పుడూ అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ అడుగుతూ వచ్చారు. ఈ ప్రశ్నకు చాలా సార్లు ఉపాసన అది తమ పర్సనల్ విషయమని దాటిస్తూ వచ్చింది. ఈమధ్య సద్గురు నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఇదే అంశం పైన చర్చించింది. తాను తన భర్తతో తన కుటుంబంతో చాలా సంతోషంగా ప్రేమగా ఉన్నానని ఇదంతా పక్కన పెట్టి పిల్లలు ఎప్పుడు అంటూ నా జీవితం గురించి రకరకాల పిచ్చి ప్రశ్నలు వేశారని ఆమె చెప్పుకొచ్చింది. ఇది నా ఒక్కదాని పరిస్థితి కాదని చాలామంది మహిళలు ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవలసి వస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఇక ఈ అంశాన్ని పక్కన పెడితే తాజాగా ఉపాసన తల్లి ఏందన్న వార్త మెగాస్టార్ అభిమానుల్లో అంతులేని ఆనందాన్ని నింపింది. పెళ్లయిన పదేళ్లకు ఇంట్లో ఖుషి కభర్ వినడంతో అటు చిరంజీవి ఉబ్బి తబ్బిబోతున్నారు. త్వరలో మెగాస్టార్ ఇంట్లో బుల్లి స్టార్ వస్తారంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
