టాలీవుడ్ లో మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. సుదీర్ఘ నట ప్రస్తానంలో 150కి పైగా చిత్రాలు చేసి. కమర్షియల్ హీరో అనే ఇమేజ్ తో టాలీవుడ్ ని రూల్ చేసిన డాన్స్ కింగ్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 60 ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ స్టార్ హీరోలకి పోటీ ఇస్తూ తనదైన శైలిలో డాన్స్ లతో ఇరగదీస్తూ గ్రేస్ చూపిస్తున్న మెగాస్టార్ ఛైరంజీవి ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి 44 ఏళ్ళు పూర్తయ్యింది అంటే నమ్మడం కష్టం. ఆయన నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యి నేటికీ 44 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుప్రీం హీరో ఇమేజ్ నుంచి మెగాస్టార్ అనే ఇమేజ్ వరకు ఆయన ప్రస్థానంలో లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు.
మెగాస్టార్ అనే పేరు వింటేనే పూనకాలు తెచ్చుకునే స్థాయిలో మెగా అభిమానులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది అంటే మొదటి రోజు మొదటి ఆట చూడటానికి పోటీ పడే యువతరం ఉండేవారు.ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు, స్టార్ హీరోలలో చాలామందికి ఆయనొక స్ఫూర్తి, రోల్ మోడల్. అలాగే అనుకున్న లక్ష్యం అందుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయాలి, ఎంత కసి ఉండాలి, స్టార్ హీరోగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోవడానికి ఎంత కష్టపడాలి అనే విషయాలు అతన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఇన్నేళ్ల కెరియర్ లో ఎన్నో మైలురాళ్ళు అధికమించి చిరంజీవి స్థానాన్ని అందుకోవడం ఎవరితరం కాదని చెప్పాలి.
ఇప్పటికి మెగాస్టార్ చిరంజీవి అంటే అంతే వినయం, ఎదుటివారిపై అంతే గౌరవం కనిపిస్తాయి. చిన్న హీరోలని సైతం సాదరంగా దగ్గరకి తీసుకొని ప్రోత్సహించే తత్త్వం ఆయనని గొప్ప వ్యక్తిగా మార్చింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్దన్నగా నిలబెట్టింది. ఈ సుదీర్ఘ నట ప్రస్థానంపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ లో భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు. మీకు తెలిసిన చిరంజీవి, చిరంజీవిగా పుట్టి నేటికీ 44 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. ప్రాణం ఖరీదుతో ప్రాణం పోసి, ప్రాణప్రదంగా నా ఊపిరై, నా గుండెచప్పుడై, అన్ని మీరై నన్ను 44 సంవత్సరాలు నడిపించారు. నన్నింతగా ఆదరిస్తున్న ప్రేక్షకాభిమానుల ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.