కె.జి.ఎఫ్ చిత్రంతో యావత్ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలగా కొనసాగుతున్న ప్రభాస్,ఎన్టీఆర్ లతో చిత్రాలు చేస్తున్నారు.ఈ రెండు ప్రాజెక్ట్ లు లైన్ లో ఉండగానే ప్రశాంత్ మరో స్టార్ హీరోను తన స్టోరీతో ఇంప్రెస్ చేసి అవకాశం కొట్టేశారు.
ప్రస్తుతం అందిన సమాచారం మేర ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ప్రశాంత్ ఒక స్టోరీ చెప్పారు.కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ ఈ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.ప్రస్తుతం ప్రశాంత్ తను చేస్తున్న సలార్,ఎన్టీఆర్ 31 పూర్తయ్యాక రామ్ చరణ్ తో మూవీ చేస్తారు.రామ్ చరణ్ కెరియర్ లో 18వ సినిమాగా తెరకెక్కే ఈ మూవీ కె.జి.ఎఫ్ లాగే మంచి మాస్ ఎలిమెంట్స్ తో ఉండబోతుందని సమాచారం.