విరూపాక్ష చిత్రంతో బిగ్గెస్ట్ రీ ఎంట్రీ హిట్ అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమా విజయంతో జోష్ పెంచేసిన తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే తేజ్.. పవన్ కళ్యాణ్ తో బ్రో అనే మల్టీస్టారర్ చేస్తున్న విషయం తెల్సిందే. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే .
సాయి ధరమ్ తేజ్ . సంపత్ నంది
ఈ సినిమాను పూర్తిచేసిన వెంటనే తేజ్.. డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సంపత్ నంది కి మాస్ డైరెక్టర్ గా మంచి పేరుంది. రెండేళ్ల క్రితం గోపీచంద్ తో కలిసి సీటిమార్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని మెగా మేనల్లుడుతో జట్టు కట్టాడు.
ఇక ఈ సినిమాకు గంజా శంకర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ టైటిల్ తో పాటు మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ చిత్రంలో తేజ్ ను ఊర మాస్ గా చూపించనున్నాడట సంపత్ నంది. అందుకే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
విరూపాక్ష హిట్ తో హిట్ ట్రాక్ అందుకున్న తేజ్.. ఆ హిట్ ట్రాక్ ను నిలబెట్టుకోవడానికి కథలను ఆచితూచి సెలక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో గంజా శంకర్ కూడా ఒకటి అని సమాచారం. మరి ఈ కాంబో హిట్ టాక్ ను అందుకుంటుందా..?లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే