Charmi : మన టైమ్ బాగోనప్పుడు అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందని అప్పుడెప్పుడో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ సినిమాలో చెప్పాడు. ఇది అక్షరాల నిజం. ఇక ఇక్కడ ఒక సామెత కూడా చెప్పుకోవాలి. ‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’. ఇది కూడా అక్షరాలా నిజం. చాలా ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఎందుకు అంటారా? చార్మి గురించి. మన సినిమా బాగుందని సంతోష పడాలి. ఒకవేళ పోతే ఏడవాలి. అంతేకానీ ఎదుటి వ్యక్తి సినిమా పోయిందని ట్విటర్ వేదికగా పళ్లికిలిస్తే.. ఆ తరువాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించడం చాలా కష్టంగా ఉంటుంది.
మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా.. ‘లైగర్’పోయి పుట్టెడు కష్టాల్లో చార్మి ఉంటే పాత ట్వీట్‌ను తిరగదోడి మరీ నెటిజన్లు ఆమెను ఏకి పారేస్తున్నారు. అమ్మడు ఊరికే ఉంటుందా? గతంలో బ్రూస్‌లీ సినిమా పోయిందని ట్విటర్ వేదికగా.. ఎందుకో ఏంటో చెప్పకుండా తెగ నవ్వుతున్న ఎమోజీలను గుంపగుత్తగా పెట్టేసింది. అసలే మెగా ఫ్యాన్స్ సినిమా పోయిన కాక మీదున్నప్పుడు చార్మి ఇలా చేయడం సమంజసమా? పైగా ఎదుటి వ్యక్తి ఎవరైనా కావొచ్చు.. సినిమా పోయిందనే బాధ అంతో ఇంతో ఉంటుంది. ఆ తరుణంలో ఈ స్మైలీ ఎమోజీలను పెట్టడం మెగా ఫ్యాన్స్‌కు మండేలా చేసింది.
Charmi : పూరి బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు..
మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కు రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది. ట్విటర్ నుంచి ఆ ట్వీట్‌ను తవ్వి తీసి మరీ నెటిజన్లు ఛార్మీ మీద రకరకాల కామెంట్లతో రెచ్చిపోతోన్నారు. లైగర్ సినిమాకు పూరి బ్యాచ్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇండియాను షేక్ చేసిద్ది.. వాట్ లగా దేంగే. ఆగ్ లగా దేంగే అంటూ ఇలా విజయ్-పూరిలు తెగ హడావిడి చేశారు. ఇక ఈ కామెంట్స్‌పై నెటిజన్లు రెచ్చిపోయి మరీ మీమ్స్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మీమ్స్ కడుపుబ్బా నవ్విస్తున్నా కూడా కొన్ని కాస్త హర్టింగ్‌గా కూడా ఉన్నాయి. మొత్తానికి ఎదుటి వాడి టైమ్ బాగోలేనప్పుడు మనం నవ్వి హేళన చేయకూడదు. ఎందుకంటే.. కర్మ అనేది బూమరాంగ్ అవుతుంటుంది కాబట్టి.
😂😂😂😂😂😂😂👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
— Charmme Kaur (@Charmmeofficial) October 16, 2015