మెగా కోడలు ఉపాసన తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఉపాసన ప్రధానమంత్రితో ఎందుకు సమావేశం అయ్యారో ఇప్పుడు చూద్దాం
ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ఆవిష్కరణ,ఆరోగ్య సంరక్షణ మెరుగు పరుచుకోవడం,మహిళా సాధికారత, సంస్కృతి పరిరక్షణ వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు.అలాగే సాంకేతికత మనకి ఎన్నో అవకాశాలని కల్పిస్తుంది మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.