పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓ వైపు సినిమాలు చేస్తూ, రాజకీయాలలో ఫుల్ బిజీ అయ్యి ఏపీ సీఎం పీఠమే లక్ష్యగా ముందుకి కదులుతున్నారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలని వదిలేసి మళ్ళీ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా నాలుగు సినిమాలని లైన్ లో పెట్టారు. అందులో లుసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ కి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 5న ఈ సినిమా తెలుగు, హిందీ బాషలలో గ్రాండ్ గా రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది. సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో నటించడం భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
ప్రస్తుతం సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతుంది. మెగాసూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ బి చౌదరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయి. అలాగే మాతృక సూపర్ హిట్ కావడంతో రీమేక్ అంతకు మించి సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబందించిన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక గాడ్ ఫాదర్ ఈవెంట్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలవాలని భావిస్తున్నట్లు బోగట్టా. ఇక చిరంజీవి ఒక్క మాట చెబితే పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈవెంట్ కి వస్తాడు. సినిమాకి హైప్ తీసుకురావడంతో మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒక్కటే అని అందరికి చెప్పడానికి గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని వేదికగా మార్చడానికి చిరంజీవి కూడా సిద్ధంగా ఉన్నారని టాక్. ఇక అన్నయ్య చిరంజీవి కోసం పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్ కి రావడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఇదే జరిగితే మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఓ విధంగా అది పెద్ద పండగే అని చెప్పాలి. వారి ఆనందానికి కూడా అవధులు ఉండవు. మరి ఇది ఎంత వరకు జరుగుతుంది అనేది వేచి చూడాలి.