సౌత్ ఇండియాలో ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి మీరా జాస్మిన్. ఈ బ్యూటీ అందంతో పాటు అభినయంతో కూడా ఆకట్టుకొని స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేసింది. ఏకంగా పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్స్ తో తెలుగులో సినిమాలు చేసింది. అలాగే మలయాళంలో స్టార్స్ అందరితో జతకట్టింది. ఇక హీరోయిన్ గా ఈ బ్యూటీ కెరియర్ ఎండ్ అయ్యే సమయంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. తరువాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఫ్యామిలీతో ఉన్న ఆమె కొంత కాలం క్రితం కుటుంబానికి దూరంగా వచ్చేసి వేరొక వ్యక్తితో కలిసి ఉంటున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అదే సమయంలో మీరా జాస్మిన్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. మళ్ళీ రీ ఎంట్రీ కోసం ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన పేరెంట్స్ మీద కోర్టులో కేసు పెట్టింది. ఇప్పుడు ఈ న్యూస్ సంచలనంగా మారింది. తన ఆస్తి తిరిగి తమకి ఇవ్వాలని ఆమె కోర్టు మెట్లు ఎక్కింది. అయితే ఆమె మరో వ్యక్తి వలలో చిక్కుకుంది అని అతను మీరాని వాడుకుంటున్నాడు అని ఒక వేళ ఆస్తిని ఆమెకి ఇస్తే మొత్తం నాశనం చేస్తాడని అందుకే ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్న మాట.
ఈ నేపధ్యంలో భిన్న వాదాలతో గత కొంతకాలంగా మీరా జాస్మిన్ తన కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన గొడవలు నడుస్తున్నాయని టాక్. అయితే ఎట్టి పరిస్థితిలో తాను సంపాదించిన ఆస్తి మొత్తం తిరిగి తనకి ఇవ్వాల్సిందే అని మీరా జాస్మిన్ కోర్టుకి వెళ్లినట్లు తెలుస్తుంది. మలయాళీ ఇండస్ట్రీ ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె బోల్డ్ అవతార్ లో కనిపించడానికి కుటుంబం నుంచి దూరం కావడమే కారణం అనే టాక్ కూడా వినిపిస్తుంది.