Meera Jasmine: సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నటి. తెలుగులో రవితేజ సరసన భద్ర సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గుడుంబా శంకర్ మూవీలో సైతం హీరోయిన్ గా మీరా జాస్మిన్ నటించింది. అయితే, సంప్రదాయబద్ధమైన డ్రస్సులతో సినిమాల్లో కనిపించింది. ఏనాడూ హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయలేదు. ఫీల్ గుడ్ ఇంప్రెషన్ కల్పించింది.
కానీ ఇప్పుడు నాలుగు పదుల వయసులో కాస్త ఘాటు అందాలతో రెచ్చిపోతోంది ఈ సీనియర్ హీరోయిన్. సోషల్ మీడియా వేదికగా హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హీరోయిన్లకు దీటుగా తానేమీ తీసిపోలేదంటూ అందాల ఆరబోత షురూ చేసింది మీరా జాస్మిన్. సినిమాల్లో మానేశాక ఇప్పుడు ఈ ఎక్స్ పోజింగ్ ఎంటి దేవుడా అంటూ చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మీరా జాస్మిన్ ఫొటోలతో చాలా మంది స్టన్ అవుతున్నారు.
ఇటీవల కాలంలో మీరా జాస్మిన్ తన అందాలను ఏ మాత్రం దాచుకోకుండా చూపిస్తోంది. బొద్దు తనం కాస్త తగ్గించి హాట్ గా రూపాంతరం చెందింది. ఇటీవల ఫొటో షూట్ లతో ఈ భామ కనువిందు చేస్తోంది. ఫ్లోరల్ డిజైన్ ప్రాక్ లో ఎద అందాలు ఆరబోసింది. తెలుగు చిత్ర సీమలో రీ ఎంట్రీ కోసమేనంటూ అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.
Meera Jasmine: రీ ఎంట్రీ కోసమే ఇలా..?
వివాహం తర్వాత నటనకు గ్యాప్ ఇచ్చిన మీరా జాస్మిన్.. పిల్లలు, సంసార బాధ్యతల్లో తలమునకలైంది. అయితే తాజాగా మీరా మలయాళంలో నటిస్తూ బిజీగానే ఉంది. అయితే, తెలుగు- తమిళ పరిశ్రమలకు కాస్త దూరంగా ఉంటోంది. ఇకపై అన్ని పరిశ్రమల్లోను అవకాశాల్ని కోరుకుంటోందనే సంకేతాలు పంపినట్లు భావిస్తున్నారు. ఈ ఫొటో సెషన్ లలో అందుకే ఇలా హద్దులు చెరిపేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.