Meals per day: మనలో చాలామందికి ఉండే మామూలు ప్రశ్న.. రోజుకు ఎన్నిసార్లు తినాలి? అని. కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కన్నా ముందు శరీరానికి ఎంత ఆహారం అందుతుంది అని కాకుండా, ఆహారం ద్వారా ఎన్ని రకాల పోషకాలు అందుతున్నాయి అనేది ముఖ్యం అనే విషయాన్ని గుర్తించాలి. చాలామంది సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తినకపోవచ్చు.
చాలామంది తమ ఆహారంలో పండ్లను, కూరగాయలను, ధాన్యాలను, చిక్కుల్లను, కాయ ధాన్యాలను, గింజలను, పాల ఉత్పత్తులను అలాగే మొక్క ఆధారిత పాలను తీసుకోవాల్సి ఉన్నా.. అలా తీసుకోరు. శరీరానికి తగినన్ని విటమిన్లు, ఖనిజాలను తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు.
వైద్యపరంగా ఇన్ని సార్లు తినాలని ఖచ్చితంగా లేకపోయినా నాలుగు సార్లు తింటే ఆరోగ్యానికి మంచిది అనే సలహా ఇవ్వబడింది. ఆకలి వేయకుండా సన్నగా ఉ:డే వారు లేదా ఆకలి ఎక్కువగా ఉండే వారు ఆహారాన్ని 4సార్లుగా విభజించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది అని వైద్యపరంగా చెప్పబడింది. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత శక్తి లభిస్తుంది.
Meals per day:
నాలుగు సార్లుగా విభజించి ఆహారాన్ని పూర్తిగా కాకుండా 80శాతం తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందని వైద్యపరంగా సలహా ఇవ్వబడి్ది. నిద్రపోయే ముందు రెండు లేదంటే మూడు గంటల ముందు ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయాలని సలహా ఇవ్వబడుతోంది. అప్పటికీ మీకు ఆకలిగా అనిపిస్తే పాలు తాగితే సరిపోతుంది.