Marriage: చాలామంది పెళ్లికి రెడీ అయినప్పుడు తమకు నచ్చిన పార్ట్ నర్ కోసం వెతుకుతూ ఉంటారు. ఈమధ్యన ఎక్కువగా మాట్రిమోనియల్ వెబ్ సైట్ల ద్వారా పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి రెడీ అయిన వారు దేనిని ఎక్కువగా పట్టించుకుంటున్నారనేది కీలకంగా మారింది. మరి మ్యాట్రిమోనీ సైట్ లు చేసిన సర్వేలో ఏం తేలిందో తెలుసుకోండి.
ఆన్లైన్లో అంటే మ్యాట్రిమోనీ సైట్లలో తమకు కావాల్సిన పార్ట్ నర్ కోసం వెతికే క్రమంలో చాలామంది ఫోటోలను ఎక్కువగా పట్టించుకుంటున్నారట. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో 43శాతం మంది అందంగా ఉండే ఫోటోలను కలిగిన ప్రొఫైల్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారట.
అంటే సగం మంది మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో కనిపించే ప్రొఫైల్ పిక్ ఆధారంగానే ముందుకు సాగాలా వద్దా అని నిర్ణయించుకుంటున్నారట. కాబట్టి ఒకవేళ మీరు కూడా పెళ్లి కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్ ద్వారా ప్రయత్నిస్తుంటే మాత్రం వెంటనే ప్రొఫైల్ పిక్ ని అందంగా ఉండేలా మార్చెయ్యండి.
Marriage:
మ్యాట్రిమోనీ వెబ్ సైట్లలో ఎక్కువ ప్రొఫైల్ పిక్ లను ప్రిఫర్ చేస్తుండగా.. తర్వాత అబ్బాయి/అమ్మాయి స్టేటస్, ఉద్యోగం, బ్యాగ్రౌండ్ లాంటి ఇతర అంశాలను చూస్తున్నారట. అంటే పెళ్లికి సిద్ధమవుతున్న వారు మ్యాట్రిమోనీ సైట్ల ద్వారా వెతికేటప్పుడు ముందు ప్రొఫైల్ పిక్ చూసి ఆ తర్వాత మిగిలిన అంశాల గురించి పట్టించుకుంటారట.