Marriage : నేటి తరం యువత పెళ్లికి కాస్త వెనకడుగు వేస్తున్నారు. లేదా ఆలస్యంగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. పెళ్లి అంటే వారిలో నిండిపోయిన భయమే దానికి కారణం. అయితే ఆ భయాలన్నీ వదిలేసి ముందడుగు వేసి జీవిత మాధుర్యాన్ని అనుభవించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే పెళ్లికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.
సారీ చెప్పడానికి వెనుకాడొద్దు..
క్షమాపణ అనే పదం నిజమైన అర్థాన్ని మీరు వైవాహిక సంబంధంలో మాత్రమే అర్థం చేసుకుంటారు. మీరు నిజంగా ఏదైనా తప్పు ఉంటే, క్షమాపణ చెప్పడానికి వెనుకాడొద్దు. దీనికి విరుద్ధంగా నిందించడం కొనసాగిస్తే జీవితం ప్రభావితం అవుతుంది. క్షమాపణలు చెప్పడం వల్ల చిన్న విషయాలను మర్చిపోవడం సులభం అవుతుంది.
పెళ్లి అంటే బాధ్యత..
జీవిత చరమాంకంలో తోడు, భద్రత కోసం పెళ్లి చేసుకోవాలని కొందరు భావిస్తుంటారు. పెళ్లి అంటే భద్రత కాదు బాధ్యత అని గుర్తుంచుకోండి. వివాహం అనేది జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. మీరు తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. కాబట్టి భాగస్వామిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి.
Marriage :
భాగస్వామి చెప్పేది వినండి..
పెళ్లి అనేది ఇద్దరి మధ్య పరస్పర సంబంధం. మీరు మాట్లాడటం మాత్రమే కాదు, మీ భాగస్వామి చెప్పేది కూడా వినాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం గివ్ & టేక్ పాలసీ లాగానే మీ భాగస్వామి బాధలు, సంతోషాలను పంచుకోవాలి.