Marriage Mistakes: ఏ బంధమైనా మనం పెంచుకుంటే, నిలుపుకుంటేనే ఉంటుంది. మరీ ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో విలువ ఉంది. వివాహ బంధాన్ని బలంగా ఉంచుకోవాలన్నా, దానిని నిలుపుకోవాలన్నా.. ఆ బంధాన్ని కలిగిన ఇద్దరు వ్యక్తులు ముందుకు రావాలి. ఒకవేళ మీరు మీ వివాహ బంధాన్ని నిలుపుకోవాలి లేదంటే మరింత దృఢంగా మార్చుకోవాలనుకుంటే కొన్ని చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఫీలింగ్స్ ని పంచుకోండి:
భార్యభర్తల బంధంలో ఇది ఎంతో కీలకం. ఒక ఫీలింగ్స్ ను ఒకరు పంచుకోవడం వల్ల వారి బంధం బలంగా మారుతుంది. ఫీలింగ్స్ ని పంచుకోవడంతో పాటు అవతలి వ్యక్తి ఫీలింగ్స్ ను అర్థం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకరంటే ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది. దీని వల్ల ఇద్దరిలో నమ్మకం కూడా పెరుగుతుంది.
గొడవలను పరిష్కరించుకోండి:
భార్యభర్తల మధ్య గొడవలు అనేవి మామూలుగా జరుగుతూనే ఉంటాయి. అయితే ఆ గొడవలకు ఎలాంటి పరిష్కారం ఇచ్చామనేదే బంధాన్ని నిర్ణయిస్తుంది. ఏ గొడవను పరిష్కరించకుండా వదిలెయ్యడం మంచిది కాదు. గొడవ చిన్నదైనా, పెద్దదైనా దాని గురించి అవతలి వ్యక్తితో మాట్లాడండి. గొడవకు కారణం ఏంటో చర్చించి, దానిని పరిష్కరించుకోండి.
Marriage Mistakes: పరస్పర సహకారించుకోండి:
వివాహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు అండగా నిలబడటం ఎంతో అవసరం. అందుకే మీ భార్య లేదంటే భర్త చేసే ఏ పనికైనా మీరు సహకరించండి. మీరు ఏదైనా పని మొదలుపెడితే, దానికి మీ పార్ట్ నర్ సహాయం తీసుకోండి. దీని వల్ల ఒకరంటే ఒకరికి గౌరవం, ప్రేమ ఏర్పడతాయి.
శృంగారం:
వివాహ బంధంలో మరో కీలకమైన అంశం శృంగారం. శృంగారం అనేది కేవలం కోరికలతో ముడిపడినది మాత్రమే కాదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమను పెంచే అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి మీ పార్ట్ నర్ తో మరింత దగ్గర అవడానికి దీనిని కూడా ప్రయత్నించాలి.