దేశంలో గంజాయి పట్టుబడిన ప్రతిసారీ దాన్ని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే చూపుతున్నాయి.గంజాయిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సాగు చేస్తున్నారు.ముఖ్యంగా విశాఖ మన్యంలో అత్యంత రహస్యంగా సుమారు 15 వేల ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నారు.ఏటా ఇక్కడ పండిస్తున్న గంజాయి విలువ 8వేల కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఈ పంట దేశ విదేశాలకు చేరుకునేసరికి దీని ధర సుమారు 25 వేల కోట్ల రూపాయలు పలుకుతుంది.కొరియర్ సర్వీస్ లను ప్రధానంగా వాడుకొని ఈ గంజాయిని పక్క రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా జాడను అధికారులు కనిపెట్టలేకపోతున్నారు.
భారీ ఎత్తున జరుగుతున్న ఈ గంజాయి సాగును అధికారులు త్వరగా పట్టుకోకపోతే ఎంతమంది యువతి,యువకులు జీవితాలను నాశనం చేయడానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.