మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తెలుగు, హిందీ భాషలో ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ కథతో ఒక మూవీకి ఒకే చెప్పాడు. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక రియల్ లైఫ్ సంఘటనలని బేస్ చేసుకొని ఈ మూవీ కథని దర్శకుడు సిద్ధం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. హిందీ, తెలుగు భాషలో ఒకేసారి ఈ సినిమా షూటింగ్ జరగబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
వరుణ్ తేజ్ హైట్ కి ఈమె కరెక్ట్ గా మ్యాచ్ చేయడంతో పాటు, మిలటరీ విమెన్ తరహాలో ఆమె పాత్ర కూడా ఉండబోతుంది. ఈ కారణంగానే దర్శకుడు మానుషీని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీ పృథ్వీరాజ్ మూవీలో అక్షయ్ కుమార్ కి జోడీగా బాలీవుడ్ లోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అయితే రెండో అవకాశం ఇప్పుడు వరుణ్ తేజ్ కి జోడీగా రావడం విశేషం.
ఈ సినిమా హిట్ అయితే తెలుగు పాన్ ఇండియా సినిమాలలో ఆమెకి ఛాన్స్ లు రావడం పక్కా అనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. దీని తర్వాత హిందీ, తెలుగు భాషలలో తెరకెక్కబోయే బైలింగ్వల్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.