మంచు మనోజ్ కొన్ని పర్సనల్ కారణాల వల్ల తన భార్యతో విడాకుల తీసుకున్నారు.పర్సనల్ లైఫ్ లో ఇలా ఊహించని డిస్టబెన్స్ రావడంతో ఆయన కొంతకాలం సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు.ఇక ఇప్పుడిప్పుడే మనోజ్ కొన్ని చిత్రాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.సరిగ్గా ఇలాంటి టైంలో సోషల్ మీడియాలో మంచు మనోజ్ మళ్ళీ వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని త్వరలో ఈ పెళ్లి జరగబోతుందని ప్రచారం జరుగుతుంది.
తాజాగా జరుగుతున్న ఈ ప్రచారంపై స్పందించిన మంచు మనోజ్
దయచేసి నన్ను కూడా ఆ పెళ్లికి ఆహ్వానించండి.ఇంతకీ పెళ్లి ఎక్కడా?ఎవరా బుజ్జి పిల్లా,తెల్ల పిల్లా?మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం రా అంటూ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి.