Manish Pandey: ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండే ఆటగాళ్లలో మనీష్ పాండే ఒకడు. ఇండియా తరపున 29 వన్డేలు, 39 T20 మ్యాచులు ఆడిన మనీష్ పాండే వన్డేల్లో 33 సగటుతో, T20ల్లో 44 సగటుతో పరుగులు చేశాడు. అయితే మంచి ప్రదర్శన చేసినా అవకాశాలు రాకపోవడంతో మానసికంగా దెబ్బతిన్నానని చెప్పాడు. ఇలాగే సరిగ్గా అంబటి రాయుడు విషయంలో కూడా జరిగిన సంగతి మనకు తెలిసిందే. అంబటి రాయుడు వన్డేల్లో మంచి ప్రదర్శన చేసినా అవకాశాలు రాకపోవడంతో మానసికంగా దెబ్బతిని రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మనీష్ పాండే మాట్లాడుతూ సంజూ శాంసన్‌లానే తనకు అన్యాయం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. నేను ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌లో కూర్చున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ ఉందన్నాడు. రిజర్వ్ బెంచ్‌లో ఖాళీగా కూర్చుంటే చాలా బాధగా ఉంటుంది. టీమ్‌లో ఉన్న వారి కంటే మనం తక్కువ అనే ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ విషయంలో క్రీడా స్ఫూర్తి చాలా అవసరం.
మళ్ళీ టీమిండియా జట్టులోకి వస్తా: మనీష్ పాండే
జట్టుకు ఏ ఆటగాడు అవసరమో కెప్టెన్, కోచ్ నిర్ణయిస్తారు. అంతే తప్ప! మనం తక్కువా? వాళ్లు ఎక్కువా అని కాదని చెప్పుకొచ్చాడు. నాకు అవకాశం వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడాలని తాపత్రయపడ్డాను. ఇప్పుడు సంజూ శాంసన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన మ్యాచుల్లో బాగా ఆడుతున్నాడు. తను కూడా ఇదే మైండ్‌సెట్‌తో ఉంటే బెటర్. అయితే జట్టులో ప్లేస్ రాకపోయినా, రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా.. అది మన ఆటపై ప్రభావం చూపించకుండా చూసుకోవాలి.. ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి” అని అన్నాడు.
Manish Pandey:
అవకాశం వచ్చినప్పుడు ఆడితే, టీమ్‌లో ప్లేస్ దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని, త్వరలోనే టీమ్‌లో ప్లేస్‌ని తిరిగి సంపాదించుకుంటాననే నమ్మకం ఉందన్నాడు. కొంత కాలంగా మిడిల్ ఆర్డర్ సమస్య టీమిండియాను వేధిస్తోంది. మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, మనీష్ పాండే లాంటి ఆటగాళ్ళు ఉంటే టీమిండియా మరింత బలంగా తయారవుతుంది అని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.