మంచు విష్ణు హీరోగా ఫుల్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం జిన్నా. కోన వెంకట్ అందిస్తున్న కథతో కొత్త దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా సాగుతుంది. ఇందులో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, హాట్ బ్యూటీ సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మోసగాళ్లు డిజాస్టర్ తర్వాత ఎలా అయిన హిట్ కొట్టాలనే కసితో మంచు విష్ణు తనకి అలవాటైన హిట్ ఫార్ములాని ఎంచుకొని జిన్నా సినిమా చేస్తున్నాడు. ఇందులోకి గాలి నాగేశ్వరరారు అనే పాత్రలో మంచు విష్ణు కనిపించబోతున్నాడు. ఫుల్ ఆఫ్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుంది.
ఇప్పటికే హీరోయిన్ గా వరుస ఫ్లాప్ లతో దూసుకుపోతున్న పాయల్ రాజ్ పుత్ ని హీరోయిన్ గా తీసుకోవడంతో పాటు సన్నీ లియోన్ ని దించడంతో సినిమాలో అందాల ప్రదర్శనకి కొదవే ఉండదని అర్ధమవుతుంది. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీ అంటే మొదటి నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది. తమ ప్రతి సినిమాకి కూడా ఇలా ఒక్కో వివాదం రాజుకుంటుంది. ఎన్ని వివాదాలు వచ్చిన కూడా వారు తమ సినిమాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే ప్రస్తుతం జిన్నా సినిమా టైటిల్ విషయంలో వివాదం రాజుకుంది. జిన్నా పేరు ఇండియన్స్ తీవ్రంగా వ్యతిరేకించే మహమ్మద్ అలీ జిన్నా పేరుని సూచిస్తుంది.
ఆ పేరు కనిపిస్తే వెంటనే అతనే గుర్తుకొస్తాడు. ఏపీలో బీజేపీ పార్టీ గుంటూరులో ఉన్న జిన్నా టవర్ పేరు మార్చమని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో మంచు విష్ణు తన సినిమాకి కావాలని జిన్నా పేరు పెట్టడంతో ఒక్కసారిగా బీజేపీ నాయకులకి ఆగ్రహం తెప్పించింది. జిన్నా పేరు మార్చుకోవాలని లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే మంచు విష్ణు మాత్రం జిన్నా టైటిల్ విషయంలో తగ్గేదిలే అంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా జిన్నా టైటిల్ తోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ కి డేట్ అన్నౌన్స్ చేశారు. పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ లతో కలిసి ఉన్న స్టిల్ రిలీజ్ చేసి టీజర్ డేట్ కన్ఫర్మ్ చేశారు. మరి ఈ జిన్నా టైటిల్ విషయంలో వివాదం ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.