స్టార్ దర్శకుడి స్థాయి నుంచి తన స్వయంకృత అపరాధంతో శ్రీనువైట్ల క్రిందికి పడిపోయాడు. ఒకప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోయిన ఈ టాలెంటెడ్ దర్శకుడు బ్రూస్ లీ నుంచి డౌన్ ఫాల్ లో నడుస్తున్నాడు. ఆ సినిమా డిజాస్టర్ ఎఫెక్ట్ శ్రీనువైట్ల మీద గట్టిగానే పడింది. ఇతర స్టార్ హీరోలు ఎవరూ అతనితో వర్క్ చేయడానికి ముందుకి రాలేదు. అయితే ఏదో చేసి తన మొదటి సినిమా హీరో రవితేజతో సినిమా చేసే ఛాన్స్ ని శ్రీనువైట్ల సొంతం చేసుకున్నాడు. అమర్ అక్బర్ అంటోనీ టైటిల్ తో తెరకెక్కిన ఆ సినిమా కూడా పాత మూసలోనే, రొటీన్ ఫార్ములా కథతో విసుగు తెప్పించి డిజాస్టర్ అయ్యింది.
ఆ తరువాత అతనితో సినిమా చేసే హీరోలే కరువైపోయారు. అయితే చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ ని ఎనౌన్స్ చేసాడు. ఢీ అండ్ ఢీ టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే తరువాత ఈ సినిమా ఊసే లేకుండా పోయింది. రీసెంట్ గా గోపీచంద్ తో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని శ్రీనువైట్ల ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
దీంతో మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ ఆగిపోయిందని అందరూ భావించారు. అయితే తాజాగా జిన్నా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఢీ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ అవుతుందని, ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని చెప్పాడు. అయితే ఆ మూవీ శ్రీనువైట్ల దర్శకత్వంలోనే ఉంటుందా లేదంటే కోన వెంకట్ సహకారంతో వేరొక దర్శకుడితో చేస్తున్నాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.