Manchu Lakshmi:మంచు లక్ష్మి భారతీయ నటి, నిర్మాత. ఈమె నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న . ఈమె బుల్లితెర వ్యాఖ్యాత గా కూడా పనిచేస్తుంది. మంచు లక్ష్మి 2006లో చెన్నైకి చెందిన ఐటీ ప్రొఫెషనల్ ఆండీ శ్రీనివాసన్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు సరోగసీ ద్వారా ఒక కుమార్తె జన్మించింది .
తెలుగు సినీ పరిశ్రమలో మంచు లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా తో అడుగుపెట్టింది. ఆ తర్వాత గుండెల్లో గోదారి, బుడుగు, లక్ష్మి బాంబ్ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌కు సహ-యజమానిగా ఉంది.గత కొన్ని రోజుల నుంచి మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
మంచు మనోజ్ కూడా ఈ వార్తల గురించి మంచి రోజులు చూసుకొని చెబుతాను అని చెప్పారు. తాజాగా ఈ విషయంపై మంచు లక్ష్మి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పైన, మనోజ్ రెండో పెళ్లి పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న విషయం గురించి యాంకర్ ప్రశ్నించగా, మనోజ్ పెళ్లి గురించి నేనేం చెబుతానండి ఎవడి దు** వాడిదే.ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనివ్వండి. నిజాయితీ గల, నిజమైన ప్రేమ మనోజ్ పొందినందుకు సంతోషంగా ఉంది. నేను కూడా బ్లెస్ చేస్తున్నా అని మంచు లక్ష్మి చెప్పింది.
మా ప్రెసిడెంట్ విష్ణు గురించి యాంకర్ ప్రశ్నించినప్పుడు దానికి మంచు లక్ష్మి సమాధానమిస్తూ,మా ఇదంతా బుల్ షిట్. పొలిటికల్ సిస్టంలో ఒకరు బాగున్నారంటే మరొకరు బాగాలేరని చెప్పడానికి రెడీగా ఉంటారు. ఒక రంగంలో దిగాక మంచితో పాటు చెడుని కూడా సమానంగా చూడగలగాలి. వాళ్లు మనల్ని చెడు అంటే మనం చెడు అయిపోతామా, అందుకే ఖచ్చితంగా హుందాగా ఉండాలి. అంటూ విష్ణుకి సలహా ఇచ్చారు.
Manchu Lakshmi: ఆహా భోజనంబు అనే కుకింగ్ షో
సినీ ప్రముఖులం కాబట్టి ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామా అని కొంతమంది కాచుకుని ఉంటారు. మమ్మల్ని ఇండస్ట్రీలో బాగానే చూసుకుంటారు. కానీ ఈ నెగిటివిటీ ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు అని ఆమె అన్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి ఆహా ఓటీటీలో ‘ఆహా భోజనంబు’ అనే కుకింగ్ షో చేస్తు బిజీగా ఉన్నారు.