Manchu Lakshmi: మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనపరంగా సినిమాలు ఒకపక్క చేస్తూనే మరోపక్క సమాజానికి ఉపయోగపడేలా.. అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటది. మేము సైతం లాంటి కార్యక్రమం ద్వారా చాలామంది పేదవాళ్ల జీవితాలలో మంచు లక్ష్మి వెలుగులు నింపింది. తిరుపతిలో తమ సొంత విద్యాసంస్థలు శ్రీ విద్యా నికేతన్ లో చాలామంది పేదవాళ్లకు ఉచిత విద్యను అందించే దిశగా అప్పట్లో ముందడుగులు వేసింది.
తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు మండలం పటేల్ గూడెం ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మంచు లక్ష్మి గతంలో శ్రీకారం చుట్టడం తెలిసిందే. ఒకటి కాదు ఏకంగా 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని.. తన వంతు సాయం అందిస్తూ ఉంది. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లలో… బుల్లితెరపై రాణిస్తూ మల్టీ టాలెంటెడ్.. యాక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించింది. ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో సైతం రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ అనేకమంది ఫాలోవర్స్ కూడా మంచు లక్ష్మి సంపాదించుకోవడం విశేషం.
యోగా చేస్తూ ఇంకా వర్కౌట్స్ చేస్తూ.. మంచు లక్ష్మి పోస్ట్ చేసే ఫోటోలు ఎంతగానో వైరల్ అవుతూ ఉంటాయి. కుర్ర కారు అటెన్షన్ ఎంతగానో కట్టి పడేసి మంచు లక్ష్మి ఫోజులకి భారీ ఎత్తున లైకులు పడుతుంటాయి. తాజాగా ఇతరహాలోనే విరహ వేదనలో అన్నట్టు మంచు లక్ష్మి ఫోటోకి ఇచ్చిన స్టిల్..కి ఫ్యాన్స్ చూపు తిప్పుకోలేకపోతున్నారు. మనం సంతోషంగా ఉండటం కోసం శాంతిని వెతుకుతాం అంటూ ఈ ఫోటోకి మంచు లక్ష్మి క్యాప్షన్ పెట్టడం జరిగింది.