మంచు ఫ్యామిలీ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తూ ఉంటుంది. చేసినదానికి మించి వారి మాటలు ఉంటాయనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు లక్ష్మిపైన ఎక్కువగా ట్రోలింగ్ నడుస్తూ ఉంటాయి. అయితే ట్రోలింగ్ ని మంచు లక్ష్మి మాత్రం క్యాజువల్ గానే తీసుకుంటుంది. ముఖ్యంగా తన తెలుగు స్లాంగ్ విషయంలో చాలా మీమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే సెలబ్రెటీలు కూడా ఆమె తెలుగు వాచకం పై సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే నేటివ్ ఇంగ్లీష్ తరహాలో ఆమె తెలుగు బాషతోనే హోస్ట్ గా టెలివిజన్ పై సక్సెస్ అయ్యింది.
ఇప్పుడు ఆహా ఓటీటీలో కుక్కరి షో చేస్తుంది. దీనికి మంచి ఆదరణ వస్తుంది. ఇదిలా ఉంటే బాహుబలి సినిమాలోని శివగామి పాత్ర కోసం ముందుగా రాజమౌళి తనని సంప్రదించారని, అయితే తాను ప్రభాస్ కి తల్లిగా నటించడానికి సిద్ధంగా లేనని చెప్పడంతో ఆ అవకాశం రమ్యకృష్ణకి వెళ్లిందని ఆ మధ్య కామెంట్స్ చేసింది. మరోసారి శివగామి పాత్ర గురించి మంచు లక్ష్మి తన మనసులో మాట బయటపెట్టింది. బాహుబలిలో రాజమాత పాత్రని చేయకుండా చాలా మంచి పనిచేశానని చెప్పుకొచ్చింది.
ఒక వేళ ఆ పాత్రలో తాను నటించి ఉంటే బాహుబలి సూపర్ హిట్ అవ్వడం వలన తరువాత కూడా కెరియర్ లో అలాంటి పాత్రలనే చేయాల్సి వచ్చేదని చెప్పింది. దర్శకులు కూడా తనకి అలాంటి క్యారెక్టర్స్ నే ఆఫర్ చేస్తారని చెప్పింది. తాను ఒకే తరహా పాత్రలు చేయడానికి అంతగా ఆసక్తి చూపించానని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త క్యారెక్టర్స్ చేయడానికి ఇష్టపడతానని చెప్పింది. ఈ విషయంలో శివగామి పాత్రనిఒప్పుకోకుండా నేను చాలా మంచి పనిచేశానని అనిపిస్తుంది అని మంచు లక్ష్మి చెప్పింది. అయితే ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.