ఏక్ మినీ కథతో యువతకు బాగా దగ్గరయిన సంతోష్ శోభన్ మారుతి దర్శకత్వంలో నటించిన మంచి రోజులు వచ్చాయి మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఆ మూవీ రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా కథ విషయాని వస్తే :
తన కూతురుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి తను తన మాటే వింటుందని నమ్ముతున్న తండ్రి గోపాలం(అజయ్ ఘోష్) ఆనందాన్ని చూడలేని ఆ కాలనీలోని కోటి, మూర్తి గోపాలం కూతురు పద్మజ(మెహ్రీన్) గురించి లేని పోనివి చెబుతూ వస్తుంటారు.దీంతో భయపడిపోయిన గోపాలం తన కూతురిని కాపాడుకోవాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తుంటాడు.ఈ క్రమంలో గోపాలం, పద్మజ బాయ్ ఫ్రెండ్ సంతోష్ (సంతోష్ శోభన్) కు గొడవ జరుగుతుంది.ఆ గొడవ ఎటువైపు దారి తీసింది?అప్పడాల విజయలక్ష్మి ఎవరు?అసలు కరోనా ఈ మూవీలో ఎలాంటి పాత్ర పోషించింది అనేవి తెలియాలంటే ఈ మూవీ చూడాలి.
ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే :
మూడేళ్లుగా తన కొలీగ్ అయిన సంతోష్ శోభన్ తో ప్రేమలో ఉంటూ ఇంట్లో తెలియకుండా రిలేషన్ ను మెయింటైన్ చేస్తున్న మెహ్రీన్,మూడేళ్లుగా తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి ఎక్కడ దూరమైపోతుందో అని సంతోష్ పడే తాపత్రయం ఆరాటం యువతకు బాగా కనెక్ట్ అవుతుంది.ఇక
ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్న కూతురు తన మాట జవదాటదనుకుంటున్న తండ్రి పాతికేళ్లు కంటిపాపలా కాపాడుకున్న కూతురు కోసం ఎంత దూరమైనా వెళ్లగలరో కళ్ళకి కట్టినట్టు ఈ మూవీలో అజయ్ ఘోష్ చూపించారు.డాక్టర్ గా కనిపించిన వెన్నల కిషోర్ పర్వాలేదనిపించారు.సప్తగిరి ట్రాక్ కొత్తగా ఉంది.రియాల్టీకి దగ్గరగా ఉన్న ఈ స్టోరీ సీన్స్ పరంగా చాలా వీక్ గా ఉంది దానికి తోడు కరోనా ట్రాక్ కథతో సింక్ అవ్వకపోడం వల్ల ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టింది.ఈ మూవీ కొచ్చే మాస్ అభిమానులను అలరించే బాధ్యతను తీసుకున్న అప్పడాల విజయలక్ష్మి కొంత మేర సక్సెస్ అయ్యారు.మొత్తానికి కుటుంబ ఆడియెన్స్ ను అలరించడంలో ఈ మూవీ కొంతమేర సక్సెస్ సాధించింది.