Bigg boss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్స్ కోసం కొందరు తోటి నటీనటులు రంగంలోకి దిగుతున్నారు. వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా కీర్తి భట్ కోసం బిగ్‌బాస్ సీజన్ కంటెస్టెంట్ మానస్ రంగంలోకి దిగాడు. కీర్తి తన పర్సనల్ కారణాల వల్లో మరొకటో కానీ తొలి మూడు వారాలు హౌస్‌లో ఉందంటే ఉంది అంతే.. పెద్దగా టాస్క్‌లో పార్టిసిపేట్ చేసింది లేదు. కానీ నాలుగో వారం మాత్రం మంచి ప్రతిభను కనబరిచి కెప్టెన్ అయ్యింది. అయితే అమ్మడితో పాటు కార్తీక దీపం సీరియల్ నెక్ట్స్ జనరేషన్ కథలో మానస్ నటించిన విషయం తెలిసిందే.
కీర్తిని చాలా గొప్పగా ప్రేమించే వ్యక్తిగా.. డాక్టర్‌గా ఈ సీరియల్‌లో మానస్ నటించాడు. అయితే ప్రస్తుతం వీళ్ల కథకి బ్రేక్ వేసి తిరిగి పాత కథనే కంటిన్యూ చేస్తున్నారు. దీంతో కీర్తి బిగ్‌బాస్‌కి జంప్ అయ్యింది. తాజాగా ఆమె టైటిల్ గెలవాలని కోరుతూ మానస్ ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. కీర్తి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయని.. ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నా కూడా తనలాంటి జీవితం మరొకరికి రాకూడదని ఓ పాపను పెంచుకుందని వెల్లడించాడు. ఇంతవరకూ మనకు తెలిసిన విషయమే. కీర్తి లాంటి మంచి మనసు వ్యక్తిత్వం ఉన్న అమ్మాయికి అండగా నిలవాలని మానస్ కోరాడు.
ఇంకా మానస్ మాట్లాడుతూ.. కీర్తి ఒక పాపను దత్తతు తీసుకుంది అన్నా కూడా ఆమెకు నచ్చదని.. ఆ బాధ ఎలా ఉంటుందో ఆమె అనుభవించింది కాబట్టి తెలుసన్నాడు. అయితే ఆ పాపని తానెప్పుడూ చూడలేదన్నాడు. అసలు కీర్తి తన గురించిన విషయాలేవీ ఇంటర్వ్యూలలో చెప్పదని మానస్ పేర్కొన్నాడు. ఒకవేళ చెబితే ఫ్యూచర్‌లో ఆ పాప ఆ ఇంటర్వ్యూలను చూస్తే బాధ పడుతుందని చెప్పదన్నాడు. తనతో కీర్తి చాలా సార్లు ఆ పాప ఫ్యూచర్ గురించి చర్చించిందని.. పాప ఫ్యూచరే తనకు ముఖ్యమని చెప్పేదన్నాడు. అయితే ఆ పాపను తనెప్పుడూ చూడలేదన్నాడు. ప్రతి ఒక్కరూ కీర్తికి అండగా నిలవాలని మానస్ కోరాడు.