Viral : బాగా లావైపోతే.. ఆ తరువాత దారుణమైన పరిస్థితులను ఎదుర్కొవాలి. సమాజం చిన్నచూపు.. ఫ్రెండ్స్ కుళ్లు జోకులు.. ఇష్టపడే వ్యక్తులు కాస్తా అయిష్టం వ్యక్తం చేస్తుంటారు. ఏజ్ కూడా బాగా ఎక్కువగా కనిపించి తమ కంటే పెద్దవాళ్లకు కూడా అంకుల్స్/ఆంటీల్లా కనిపిస్తాం. పరిస్థితి అలా మారిపోతుంది. ఇక తగ్గడం మన చేతుల్లో ఉండదు. చాలా చాలా శ్రమించాలి. దానికి అంకిత భావం ఉండాలి. అందరి వల్లా అయ్యే పని కాదది. కానీ ఒక వ్యక్తి మాత్రం ఏడాదిలో 70 కిలోలు తగ్గిపోయాడు. షాకింగ్‌గా అనిపిస్తోంది కదా.
పువి అనే వ్యక్తిని బాగా లావుగా ఉన్నాడని ఓ వ్యక్తిని అతని గర్ల్‌ఫ్రెండ్ వదిలేసి వెళ్లింది. దీంతో పువి చాలా కుంగిపోయాడు. అయితే ఆమెకు తన మాటలతో కాకుండా చేతలతో తగిన సమాధానం చెప్పాలనుకున్నాడు. దీనికి ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఏకంగా 70 కిలోలు బరువు తగ్గి.. ఊబకాయం నుంచి కండల వీరుడిగా తయారయ్యి వావ్ అనిపించాడు. స్ఠూలకాయం నుంచి ఫిట్‌గా మారిన అతడు చాలా మందికి ఆదర్శంగా నిలిచాడు. తన వెయిట్ లాస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆన్‌లైన్ స్టార్‌గా మారాడు.
Viral : 139 కిలోల బరువున్న పువి.. 74కు చేరాడు..
వెయిట్ లాస్ కోసం ముందుగా అనుకున్నట్లుగానే జిమ్‌కు వెళ్లి వర్కౌట్ చేయడం ప్రారంభించాడు. మెల్లమెల్లగా పువి తన శరీరంలో మార్పును చూడటం ప్రారంభించాడు. ప్రియురాలు బ్రేకప్ చెప్పిన 139 కిలోల బరువు ఉన్న పువి.. 18 నెలలు కఠిన వ్యాయామం చేసి బరువు తగ్గాడు. ఎంతలా తగ్గాడంటే 70 కిలోల కొవ్వును కరిగించి 74 కిలోలకు చేరాడు. గతంలో ట్రిపుల్ ఎక్స్‌ఎల్ సైజ్ నుంచి నుంచి ఇప్పుడు స్మాల్ సైజ్‌కు మారిపోయాడు. టిక్‌టాక్ యూజర్ పువి తన వర్కవుట్ వీడియోలను తరచూ షేర్ చేస్తుండే వాడు.దీంతో అతడి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అయితే అంతలా వర్కవుట్స్ చేయడం సరికాదని కొందరు నెటిజన్స్ సూచిస్తున్నారు.
https://www.instagram.com/reel/CgM-c8Lj1Fw/?utm_source=ig_web_copy_link