యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన మలయాళీ భామ మమతా మోహన్ దాస్ టాలీవుడ్ చాలా తక్కువ సినిమాలలో నటించింది. మాతృభాషలో సినిమాలు చేస్తున్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడి ట్రీట్మెంట్ తీసుకొని కోలుకుంది. ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవడం, తరువాత భర్తతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. క్యాన్సర్ ని జయించిన మమతా మోహన్ దారి మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె చివరిగా కేడీ సినిమాలో నాగార్జునకి జోడీగా నటించింది.
ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ 14 ఏళ్ళ తర్వాత తెలుగులో మమతా మోహన్ దాస్ రీఎంట్రీ ఇస్తుంది. తెలుగులో జగపతిబాబు లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న రుద్రంగి అనే సినిమాలో ఆమె కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమెకి సంబందించిన ఫస్ట్ లుక్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. రచయితగా పనిచేసిన అజయ్ సామ్రాట్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ కథాంశంతో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కించారు. జ్వాలాబాయ్ దొరసాని పాత్రలో ఆమె పవర్ ఫుల్ రోల్ లో ఈ సినిమాలో నటిస్తుంది. భయమెరుగని దొరసాని అంటూ ఆమె ఫస్ట్ లుక్ మోషన్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, సదానందం ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు. పటేల్ సార్ సినిమా తర్వాత మొదటి సారి ఈ సినిమాలో జగపతి బాబు మరోసారి లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే జగపతి బాబు ఈ మూవీలో కనిపిస్తాడని తెలుస్తుంది.