Minister Mallareddy: నేడు కూడా మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. అటు ఐటీ రైడ్స్ కొనసాగుతుండగానే ఇటు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే విషయాన్ని ఐటీ అధికారులకు తెలియజేయడంతో వారు ఆయనను సూరారంలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
కాగా.. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రెండో రోజుల క్రితమే మల్లారెడ్డికి స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది. భూములు ఉన్నాయి డబ్బులు అవసరం ఉంది అంటూ బేరానికి దిగినట్టు సమాచారం. తక్కువ ధరకైనా ఇస్తామని బ్లాక్‌లో ఇచ్చినా పర్వాలేదన్నారు. ఆరు నెలలుగా మల్లారెడ్డి, బంధువులు, ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ల బ్యాంక్ అకౌంట్ లను ఐటీ శాఖ గమనిస్తోంది. 300 బ్యాంక్ అకౌంట్లను స్టడీ చేసిన అనంతరం పక్కా రైడ్ నిర్వహించినట్టు తెలుస్తోంది.
మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డికి ఛాతీ నొప్పి రావడంతో నారాయణ హృదయాలయకు తరలించారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 20 మంది ఐటీ అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. సీఆర్పీఎఫ్ అధికారులు తన కొడుకును ఛాతీపై కొట్టారని ఆరోపించారు. దీంతో తన పెద్ద కొడుకు మహేందర్ రెడ్డి పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. మహేందర్ రెడ్డిని ఐటీ అధికారులు రాత్రంతా ఇబ్బంది పెట్టినట్టు ఉన్నారన్నారు.
తాము ఎవరిని దగా మోసం చేయడం లేదన్నారు. బీజేపీ దుర్మార్గ పాలనకు ఇది నిదర్శనమన్నారు.