Malika Arora : బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా, బేబో కరీనా కపూర్‌లు కలిసికట్టుగా లండన్‌లో తమ విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నారు. లండన్ వీధుల్లో ఈ ముద్దుగుమ్మలు అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌ను ధరించి హాయిగా విహరిస్తున్నారు. వీరి స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌తో లండన్‌లోనూ ఈ భామలు స్టైలిష్ క్వీన్స్ అని మరోసారి నిరూపించారు. వీరి విహార యాత్రకు సంబంధించిన పిక్స్‌ను మలైకా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Malika Arora : మలైకా అరోరా తన యంగ్ బాయ్‌ఫ్రెండ్ అర్జున్ కపూర్‌తో కలిసి షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి, ముంబైకి బై బై చెప్పి హాలిడే వెకేషన్ నిమిత్తం లండన్‌లో వాలిపోయింది. ఇక నటి కరీనా కపూర్ ఓ ప్రాజెక్ట్ నిమిత్తం ఇంగ్లాండ్ రాజధానికి చేరుకుంది. ఇక ఇంగ్లాండ్‌లో మీట్ అయిన ఈ బ్యూటీలు లండన్ వీధుల్లో హల చల్ చేస్తున్నారు.

మలైకా అరోరా, అర్జున్ కపూర్ చెల్సియా ఎఫ్‌సి ఫుట్‌బాల్ గేమ్‌ను ఆస్వాదించారు. స్టేడియం దగ్గర దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది మాలిక . తరువాత ఈ ముగ్గురూ కలిసి లండన్‌లో అద్భుతమైన టైం ను స్పెండ్ చేసారు . ఆ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి ఫాలోవర్స్‌తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

లండన్ వీధుల్లో తిరుగుతున్న కరీనా కపూర్, మలైకా అరోరాలు ఊబర్ చిక్ స్ట్రీట్ స్టైల్ ఫ్యాషన్‌ను ఫాలో అయ్యారు. మరోసారి స్టైలిష్ క్వీన్స్ అని నిరూపించారు. లండన్ టూర్‌కు సంబంధించిన పిక్స్‌ను మలైకా ఇన్‌స్టాలో షేర్ చేయగా ఫ్యాన్స్ ఇన్‌బాక్స్‌లో పొగడ్తల వర్షం కురిపించారు . ఈ ఫోటోల కింది ఈ 48 ఏళ్ల బ్యూటీ ‘ ఫ్రమ్ లాండర్స్ విత్ లవ్ ‘ అని క్యాప్షన్‌ను జోడించింది.

కరీనా కపూర్ హై నెక్ టాప్ వేసుకుని హాఫ్ స్లీవ్ శ్వటర్ ధరించింది. దీనికి జోడిగా డెనిమ్ జీన్స్ వేసుకుంది. మలైకా కో ఆర్డ్ శ్వటర్ ప్యాంటు వేసుకుంది. శ్వటర్ మీదుగా లాంగ్ కోర్ట్ ధరించింది. ఈ ముద్దుగుమ్మలిద్దరూ చలి కాలపు ఫాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.
