Malika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మతులు పోగొడుతోంది. తన వయ్యారాలు, ఒంపులతో కుర్రాళ్ళ మనసును దోచేస్తోంది. ఏజ్ పెరుగుతున్నాకొద్దీ అమ్మడి అందాలు అంతకంతకూ పెరుగుతున్నాయని అభిమానులు సంబుర పడుతున్నారు . తాజాగా ఓ ఫోటో షూట్ కోసం వేసుకున్న అవుట్‌ఫిట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు అదుర్స్ అంటూ కుర్రాళ‌్ళు కితాబిచ్చేస్తున్నారు.

మలైకా అరోరా తన ఫ్యాషన్ గేమ్‌తో తరచుగా అందరినీ అలరిస్తూ ఉంటుంది. సందర్భంతో నిమిత్తం లేకుండా ఎల్లప్పుడూ అద్భుతమైన ఫ్యాషన్స్‌ను పరిచయం చేస్తుంటుంది. క్యాజువల్ లుక్స్ నుంచి రెడ్ కార్పెట్ అవుట్‌ఫిట్స్ వరకు అన్నింటిని తనదైన టేస్ట్ ప్రకారం డిజైన్ చేయించుకుని వాటిని తన బాడీ స్ట్రక్చర్‌కు మ్యాచ్ అయ్యేలా తీర్చి దిద్దుకుంటుంది. ఈ బ్యూటీ ముంబైలో ఒక అవార్డుల కార్యక్రమానికి హాజరైనా స్టార్-స్టడెడ్ పార్టీకి హాజరైనా, ఇట్టే అభిమానుల చూపులను తనవైపు తిప్పుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల జరిగిన మరో ఈవెంట్‌లోనూ బోల్డ్ లుక్స్‌తో మైండ్ బ్లాక్ చేసింది. తెల్లటి గౌనును ధరించి ఈ బ్యూటీ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. మలైకా ఈ అవుట్‌ఫిట్‌తో అదిరిపోయే హాట్ ఫోటో షూట్ చేసింది. ఆ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసి కుర్రాళ్లను కవ్వించింది.

ఈ స్టన్నింగ్ అవుట్‌పిట్‌ను మలైకా రేచెల్ గిల్‌బర్ట్స్ బ్రైడల్ కలెక్షన్స్ నుంచి సేకరించింది. సెలబ్రిటీ స్టైలిస్ట్ మనేక హరిసింఘానీ మలైకాకు స్టైలిష్ లుక్స్‌ను అందిచింది. బోల్డ్ మేకప్‌తో ఈ హాట్ అవుట్‌ఫిట్‌లో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది మలైకా. ఈ అవుట్‌ఫిట్ రేచెల్ గిల్‌బర్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. దీని ధర అక్షరాల రూ.3, 79,497

డ్రెస్ డిజైన్ విషయానికి వస్తే వ్రాపెడ్ ఫ్యాబ్రిక్‌తో బాడీహగ్గింగ్ ఫ్రేమ్‌లో అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు. ఆఫ్ షోల్డర్ డీటైల్స్, ప్లంగింగ్ నెక్‌లైన్, సించెడ్ వెయిస్ట్, హై లో హెమ్‌లైన్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చేతి వేళ్లకు స్టేట్మెంట్ ఉంగరాలు, పెట్టుకుని పాదాలకు స్ట్రాపీ హై హీల్స్ వేసుకుంది. ఇక మేకోవర్ కోసం కనులకు డబుల్ వింగెడ్ ఐలైనర్, మస్కరా వేసుకుని పెదాలకు బోల్డ్ రెడ్ కలర్ లిప్‌స్టిక్ దిద్దుకుంది.