Malika Arora : ఏజ్ పెరుగుతున్నా కొద్దీ గ్లామర్ డోస్ పెంచేస్తోంది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుని యంగ్ హీరో తో డేటింగ్ చేస్తూ మీడియా సెన్సేషన్ అయిన మలైకా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటూ కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తోంది. తన అందాల ప్రదర్శనతో కునుకు లేకుండా చేస్తోంది ఈ బోల్డ్ బ్యూటీ .

తాజా గా ఓ స్పెషల్ సాంగ్ కోసం మాలిక అదిరిపోయే అవుట్ ఫిట్ వేసుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ సుందరి. ఈ అవుట్ ఫిట్ లో తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

Malika Arora : ఆయుష్మాన్ ఖురానా, జైదీప్ అహ్లావత్ నటించిన సినిమా నుండి ఓ కొత్త ట్రాక్ తాజాగా విడుదలైంది. ఈ ట్రాక్ జీనత్ అమన్ ఐకానిక్ 1980 పాట ఆప్ జైసా కోయికి రీమేక్ సాంగ్ . ఈ ట్రాక్‌ను జహ్రా ఎస్ ఖాన్, అల్తమాష్ ఫరీది పాడారు. ఈ సాంగ్ కు ఆయుష్మాన్ ఖురానా, మలైకా అరోరాలు పవర్ ఫుల్ స్టెప్పులు వేసి అందరిని మెస్మరైజ్ చేసారు. ప్రస్తుతం ఈ ట్రాక్ సోషల్ మీడియాలో తెగ వైరల్మ అవుతోంది. మలైకా అరోరా బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ ఈ పాటపైన సోషల్ మీడియా లో క్రేజీ కామెంట్ ను పోస్ట్ చేసాడు.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మలైకా షీర్ మెష్ ఓవర్‌లేతో అలంకరించబడిన మెరిసేటి ఆకుపచ్చ-బంగారు వర్ణం లో ఉన్న గౌనును ధరించింది. ఆభరణాలతో అలంకరించబడిన నెక్‌లైన్, కార్సెట్ బాడీస్, ఫిగర్-హగ్గింగ్ డీటెయిల్స్ తో తొడ వరకు భారీ స్లిట్ కలిగిన సీ-త్రూ స్కర్ట్ వేసుకుని తన గ్లామరస్ లుక్స్ తో క్లీన్ బౌల్డ్ చేసింది.
ఈ అవుట్ ఫిట్ లోనే అదిరిపోయే ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మలైకా గోల్డ్ స్ట్రాప్స్ కలిగిన హిల్స్ వేసుకుంది. చేతి వేళ్ళకు స్టేట్‌మెంట్ ఉంగరాలు సొగసైన బ్రాస్‌లెట్ పెట్టుకుంది. చెవులకు డాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ ను ధరించింది. తన హెయిర్ ను లూస్ గా వదులుకుని పేదలకు న్యూడ్ లిప్ షేడ్ వేసుకుంది. కనులకు స్మోకీ ఐ ష్యాడో, మస్కరా దిద్దుకుని హాట్ లుక్స్ తో ఫిదా చేసింది.
