Malika Arora : మలైకా అరోరా ఫ్యాషన్ డైరీలు రోజురోజుకు మెరుగవుతున్నాయి. ఈ బ్యూటీ మన కోసం ఎప్పటికప్పుడు తాజా ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ ఇంప్రెస్స్ చేస్తుంటుంది. ఫార్మల్ ప్యాంట్‌సూట్ నుంచి అదిరిపోయే గౌన్ల వరకు, మలైకా ప్రతి అవుట్ ఫిట్ లో యమ హాట్ గా కనిపిస్తూ కుర్రాళ్లను కావ్విస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ అద్భుతమైన గౌనుతో హాట్ ఫోటో షూట్ చేసి ఇంటర్నెట్ లో హీట్ పెంచింది .

Malika Arora : మలైకా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ దార్ సారాకు మ్యూజ్ గా వ్యవహారించింది. ఫోటో షూట్ కోసం ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి అద్భుతమైన శాటిన్ గౌనును ఎంచుకుంది. ఈ గౌన్ లో హాట్ మిర్చీలా కావ్వించింది మలైక.

ప్లీట్స్‌లో అలంకరించబడిన ఆఫ్-షోల్డర్ వివరాలను కలిగి గౌనులో అద్భుతంగా కనిపించింది ఈ హాట్ బ్యూటీ. నడుము దగ్గర వచ్చిన గోల్డెన్ సీక్విన్ వివరాలు , తొడ వరకు ఎత్తైన చీలికతో డిజైన్ చేసిన ఈ గౌన్ మలైకా ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది.

మలైకా జోయా హౌస్ నుంచి సేకరించిన సొగసైన బంగారు ఇయర్ రింగ్స్ ను, చేతివేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంది. పాదాలకీ గోల్డెన్ ఫుట్ వేర్ వేసుకుని తన రూపాన్ని మరింతగా అట్రాక్టివ్ గా మార్చుకుంది.

రీసెంట్ గా మరో హాట్ ఫోటో షూట్ తో ఇన్ స్టాగ్రామ్ ను షేక్ చేసింది మలైక. న్యూడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో హెవీ థ్రెడ్ ఎంబ్రాయిడరి తో వచ్చిన టాప్ వేసుకుని కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. డీప్ కాలర్ నెక్ లైన్ నడుము దగ్గర వచ్చిన బెల్ట్ డిటైల్స్ అవుట్ ఫిట్ కి స్పెషల్ లుక్ ను అందించాయి. మెడలో చోకర్ నెక్ లెస్ వేసుకుని బోల్డ్ లుక్ లో ఫోటోలు దిగి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. ఈ బాటమ్ లెస్ ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
