చియాన్ విక్రమ్ హీరోగా 61వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రెడీ అవుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ కడపలో తాజాగా స్టార్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపధ్యంలో ఉన్న కథతో ఈ సినిమాని పా రంజిత్ తెరకెక్కిస్తున్నారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ కథని సిద్ధం చేసిన దర్శకుడు విక్రమ్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా ముందు రష్మిక మందనని ఎంపిక చేసినట్లు సమాచారం.
అయితే విక్రమ్ కి జోడీగా ఆమె కరెక్ట్ గా లేదని భావించిన దర్శకుడు ఇప్పుడు ఆమె స్థానంలో మాళవిక మోహనన్ ని హీరోయిన్ గా ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. మలయాళీ బ్యూటీ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్ గా మారింది. తరువాత మలయాళంలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్ లతో ఒక్కసారిగా ఆమె పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.
దీంతో రజినీకాంత్ పెట్టా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఆ మూవీ తర్వాత లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబోలో వచ్చిన మాస్టర్ సినిమాలో అనూహ్యంగా అవకాశాన్ని మాళవిక సొంతం చేసుకుంది. ఇక ధనుష్ మారన్ సినిమాలో కూడా మాళవికని హీరోయిన్. ఈ రెండు సినిమాలు సక్సెస్ తో ఇప్పుడు ఏకంగా చియాన్ విక్రమ్ కి జోడీగా నటించే ఛాన్స్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. మరో వైపు మారుతి, ప్రభాస్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాతో ఏకంగా డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా తెలుగులోకి ఈ అమ్మడు ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతుంది.