Malavika Mohanan : వేసవిలో తెలుపు రంగు దుస్తులు అధికారిక ఫ్యాషన్ , కానీ మాళవిక మోహనన్ వింటర్ సీజన్‌లోనూ తెలుపు రంగుల అవుట్ ఫిట్స్ ను వేసుకొని సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్లు ఇస్తోంది. అయితే ఫ్యాషన్ ప్రియులందరినీ కూడా మాళవికా స్టైలిష్ లుక్స్ అమితంగా ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి. ఈ స్టార్ నిత్యం తన , వార్డ్ రోబ్ తో ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. వైవిధ్యమైన దుస్తుల ఎంపికలతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకుంది.

Malavika Mohanan : ఈసారి మాళవిక మోహనన్ సెల్ఫ్ సెంటర్డ్ దుస్తుల బ్రాండ్‌కు చెందిన బాడీకాన్ మిడి డ్రెస్‌లో మెరిసిపోయింది. ఫుల్-స్లీవ్స్, బాడీకాన్ ఫిట్, క్లోజ్ నెక్‌లైన్ కలిగిన ఈ అవుట్ ఫిట్ లో తన అందాలను స్పష్టంగా చూపించింది ఈ బ్యూటీ . దుస్తులకు వెండి, నలుపు రంగులలో టై-నాట్ స్ట్రింగ్ వివరాలు ఉన్నాయి. డ్రామాటిక్ బార్డర్ అవుట్ కు స్పెషల్ లుక్ ని అందించింది.

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా చెవులకు సిల్వర్ హూప్ ఇయర్ రింగ్స్ , పాదాలకు స్టైలిష్ హీల్స్‌ని ధరించింది. ఆమె సింపుల్ మేకప్ తో పెదాలకు గ్లాసి లిప్ షేడ్ పెట్టుకుని ఆకర్షణీయంగా కనిపించింది.

మాళవిక మోహనన్ తెలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతుంది. ఇది అనడం కాదు అందుకు ప్రూఫ్ కూడా ఉన్నాయి. ఓ ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ డిజైనర్ లేబుల్ ఆస్తా నరంగ్ నుంచి సీక్విన్ వర్క్, బీడ్ వర్క్, కలి డీటెయిల్స్ తో వచ్చిన లెహంగా సెట్ వేసుకుని అదరగొట్టింది. లెహంగా స్కర్ట్ కు జోడీగా డీప్ నెక్ లైన్, స్లీవ్ లెస్ బ్లౌస్ వేసుకుని కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా డ్యాంగ్లింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మెరిసింది.

ట్రెండీ అవుట్ ఫిట్స్ లోనే కాదు క్యాజువల్స్ లోనూ వైట్ కలర్ ను ఎన్నుకుంటుంది ఈ బ్యూటీ. వైట్ కలర్ ఎంబ్రాయిడరీ కుర్తాను వేసుకుని ఈ మధ్యన వరి చేలల్లో తిరిగిన పిక్స్ ను మాళవిక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ లో ఎంతో కూల్ గా కనిపించింది మాళవిక.
