Malavika Mohan: తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ ముద్దుగుమ్మ అందాలకు సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. కాగా మొదట మాళవిక పట్టం పోల్ అనే ఒక మలయాళ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత తమిళ భాషలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. కాగా ఈ సినిమా విడుదల అయి మంచి విజయం సాధించింది.
పీట సినిమాతో తెలుగులో కూడా అభిమానులను ఏర్పరుచుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. అనంతరం దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా కూడా విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారికంగా ప్రకటన కూడా రాలేదు.
ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను పెట్టాలని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మాళవిక మోహన్ సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ చేస్తూ కుర్ర కారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా మాళవిక మోహన్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలలో మాళవిక మోహన్ కురులు ముఖంపైకి వస్తూ ఉండగా అవి చేతితో పక్కకు అనుకుంటూ మత్తెక్కించే చూపులతో యువత ద్రుష్టని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు కామెంట్ లో వర్షం కురిపిస్తున్నారు.