Malaika Arora : మలైకా అరోరా తాజా ఫోటోషూట్ పిక్స్ నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తున్నాయి. స్టార్ స్టైలిష్ డార్క్ బ్రౌన్ లెదర్ బ్రాలెట్ , బైకర్ షార్ట్ సెట్‌ను ధరించి హాట్ నెస్ తో హీట్ పెంచుతోంది. ఆమె అదిరిపోయే స్మోకింగ్-హాట్ లుక్ కు మ్యాచింగ్ గా బ్లేజర్ , స్టైలిష్ బూట్‌లను వేసుకుని మెస్మెరైజ్ చేసింది.

కిమ్ కర్దాషియన్, బెల్లా హడిద్, జిగి హడిద్, హేలీ బీబర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, దీపికా పదుకొణె, నోరా ఫతేహి తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ తారలు , ప్రముఖులకు బైకర్ షార్ట్స్ , బ్రాలెట్ స్టేట్‌మెంట్ అవుట్ ఫిట్స్ ఎప్పుడూ ఇష్టమైనవే . మలైకా అరోరా కూడా తన సాధారణ విహారయాత్రలకు లేదా విమానాశ్రయం లుక్స్ కోసం ఈ ఆవుట్ ఫిట్స్ నే ఎన్నుకుంటుంది. ఈ బ్యూటీ ఇటీవల విడుదలైన సిరీస్, మూవింగ్ ఇన్ విత్ మలైకా కోసం చేసిన ఫోటోషూట్ లోనూ ముదురు గోధుమ రంగు బ్రాలెట్ బైకర్ షార్ట్ ను వేసుకుని అదరగొట్టింది. ఈ స్టైల్‌కు స్మోకింగ్ హాట్ అప్‌గ్రేడ్ ఇచ్చింది.

ఇటీవల, మలైకా అరోరా స్టైలిస్ట్, మేనకా హరిసింఘాని, ఈ స్టార్ తాజా చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముదురు గోధుమ రంగు ఫాక్స్ లెదర్ బ్రాలెట్ వేసుకుని దాని పైకి బ్లేజర్ , టైట్ ఫిట్ షార్ట్ , ఎత్తైన బూట్‌ల ను ధరించింది. మీరు మీ గర్ల్‌ఫ్రెండ్స్‌తో ఆలస్యంగా బ్రంచ్‌లు లేదా డ్రింక్ ఔటింగ్‌ల కు వెల్లాలనుకున్నపుడు ఈ అవుట్ ఫిట్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. విశాలమైన స్ట్రాపీ స్లీవ్‌లు, ఆమె డెకోలేటేజ్‌ను ప్రదర్శించే విశాలమైన యు నెక్‌లైన్, కత్తిరించిన మిడ్‌రిఫ్-బేరింగ్ హేమ్ తో డిజైన్ చేసిన బ్రాలెట్ కు జోడిగా ఎత్తైన నడుము, బాడీకాన్ సిల్హౌట్ , తొడ-పొడవు హేమ్‌తో సరిపోయే ముదురు గోధుమ రంగు బైకర్ షార్ట్ ధరించింది.

మోనోటోన్ సెట్‌కి క్లాసీ టచ్ ఇవ్వడానికి మలైకా నాచ్ ల్యాపెల్ కాలర్లు, ప్యాడెడ్ షోల్డర్‌లు, ఫుల్-లెంగ్త్ స్లీవ్‌లు, పొడవాటి హేమ్ లెన్త్ , ఓపెన్ ఫ్రంట్, ప్యాచ్ పాకెట్స్ , టైలర్డ్ ఫిట్‌లను కలిగిన బ్లేజర్‌ను వేసుకుంది.
