బాలీవుడ్ లో ప్రేమకథల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ఎవరు ఎవరితో తిరుగుతారో అనేది మాత్రం చెప్పలేం. పెళ్లి తర్వాత కూడా ఎక్స్ ట్రా అఫైర్స్ మెయింటేన్ చేసే వాళ్ళు నార్త్ ఇండియా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటారు. అలాగే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రేమాయణం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం హాన్సిక మోత్వాని పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఇప్పటికే పెళ్లైంది. ఆ పెళ్ళికి హాన్సిక కూడా వెళ్ళింది. అయితే అతను మొదటి భార్యకి విడాకులు ఇచ్చేసి ఇప్పుడు హాన్సికని పెళ్లాడబోతున్నాడు. ఇక సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ మధ్య చాలా వయస్సు వ్యత్యాసం ఉంది. ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న నిక్కి జోనస్ కి ఆమె కంటే 8 ఏళ్ళకి పైగా చిన్న వయస్సు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రేమజంట మలైకా అరోరా, అర్జున్ కపూర్. మలైకా అరోరా ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఐటెం క్వీన్ గా పాపులర్ అయ్యింది. ఇప్పటికే ఆమె సల్మాన్ ఖాన్ తమ్ముడిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులతో వేరుపడింది. దీనికి కారణం కూడా అర్జున్ కపూర్ అనే టాక్ అప్పట్లో వినిపించింది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత ఈ ఇద్దరు ఎక్కడ చూసిన జంటగానే కనిపిస్తున్నారు. ఆమె వయస్సు 40 ఏళ్ళ పైనే ఇక అర్జున్ కపూర్ వయస్సు 30 ఏళ్ళ వరకు ఉంటాయి.
మలైకా అరోరా పెళ్ళికి కూడా అర్జున్ కపూర్ వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఈ కుర్ర హీరోని వలలో వేసుకొని ముదురు భాగా తిరుగుతుంది. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు అనే టాక్ ఉంది. ఇద్దరు చాలా కాలంగా డేట్ లో ఉన్నారనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు బిటౌన్ లో ఈ ఇద్దరి లవ్ స్టొరీ హాట్ టాపిక్ గా ఉంది. దానికి కారణంగా రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో ఎస్ అంటూ పోస్ట్ చేసింది. అర్జున్ కపూర్ కి ఆమె ఒకే చెప్పిందని అందరూ భావించి విషెస్ కూడా చెప్పేశారు. తాను ఎస్ చెప్పింది. అందరూ అనుకునే విషయం కాదని మలైకా క్లారిటీ ఇచ్చింది.